Beautiful Athlete with Wild Bear: అడవి ఎలుగుబంటితో అందమైన ముద్దుగుమ్మ సావాసం, ఎందుకో తెలుసా

రష్యాకు చెందిన ఈ అందమైన యువతి ఎవరితో సావాసం చేస్తుందో తెలుసా..అంటే ఇంటా, బయటా తిరిగేది ఎవరితోనో తెలుసా. అడవి ఎలుగుతో. నిజమే. రష్యాకు చెందిన వెరోనికా డిచ్కా అథ్లెట్ కూడా. అడవి ఎలుగుబంటితో సావాసం చేస్తూ..తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు కూడా. మనమూ తెలుసుకుందాం ఆ వివరాలు..

Beautiful Athlete with Wild Bear: రష్యాకు చెందిన ఈ అందమైన యువతి ఎవరితో సావాసం చేస్తుందో తెలుసా..అంటే ఇంటా, బయటా తిరిగేది ఎవరితోనో తెలుసా. అడవి ఎలుగుతో. నిజమే. రష్యాకు చెందిన వెరోనికా డిచ్కా అథ్లెట్ కూడా. అడవి ఎలుగుబంటితో సావాసం చేస్తూ..తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు కూడా. మనమూ తెలుసుకుందాం ఆ వివరాలు..
 

1 /5

వెరోనికా, ఎలుగుబంటి కలయిక 2009లో జరిగింది. వెరోనికా ఓ సఫారీ పార్క్‌లో ఎలుగుబంటి ప్రాణం కాపాడింది. అప్పట్నించి ఇద్దరూ కలిసే జీవిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఎలుగుబంటి తోడు ఉండాల్సిందే.  

2 /5

వెరోనికా ..తన ఎలుగుబంటిని ఒక్క క్షణం కోసం కూడా విడిచి పెట్టదు. వెరోనికా, ఎలుగుబంటి ఇరువురూ కలిసి పడవలో నదిలో కూడా ప్రయాణిస్తుంటారు. ఈ ఇద్దరి మధ్య బంధం రానురానూ పటిష్టమవుతోంది.

3 /5

వెరోనికా డిచ్కా..ఈ అడవి ఎలుగుబంటిని తన బెస్ట్ ఫ్రెండ్‌గా, ఓ కొడుకుగా చూసుకుంటుంది. ఎలుగుబంటి కూడా ఆమెను ఓ తల్లిలా భావిస్తుందని వెరోనికా చెబుతోంది. ఎప్పుడూ ఆమెతోనే ఉంటుంది. 

4 /5

వెరోనికా డిచ్కా ఎప్పుడూ ఈ అడవి ఎలుగుబంటిని కార్లో లాంగ్ డ్రైవ్‌కు కూడా తీసుకెళ్తుంటుంది. కార్లో పక్కన కూర్చోబెట్టుకుని వెళ్తున్న ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి.

5 /5

సాధారణంగా ఎవరైనా సరే కుక్కల్ని లేదా పిల్లుల్ని లేదా చిలుకలు, పక్షుల్ని పెంచుకుంటుంటారు. ఇంకొందరైతే ఆవుల్ని, మేకల్ని పెంచుకుంటారు. కానీ రష్యాకు చెందిన వెరోనికా అనే ఈ అందమైన ముద్దుగుమ్మ కోరిక చాలా విచిత్రంగా ఉంది. ఈమె ఓ అడవి ఎలుగుబంటిని పెంచుకుంటోంది.