Beetroot Face Mask: బీట్ రూట్‌లో ఆరోగ్య ప్రయోజనాలు మెండు. ఇది మన శరీరంలో రక్తం కూడా పెంచుతుంది. అయితే, ఆరోగ్యం మాత్రమే కాదు... అందంపరంగా కూడా బీట్‌రూట్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖంపై వాడటం వల్ల ట్యాన్ తొలగిపోతుంది. ముఖం తెల్లగా మెరిసిపోతుంది.
బీట్‌రూట్‌తో ముఖానికి మాస్క్ వేసుకోవడం వల్ల ఎండ వల్ల ముఖ్యంపై ఉండే ట్యాన్ తొలగిపోతుంది. బీట్‌రూట్‌తో ముఖ రంగు కూడా మెరుగుపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే పార్లర్ వంటి గ్లోయింగ్ స్కిన్ ఇంట్లోనే పొందుతారు.
బీట్ రూట్, బియ్యం పిండి రెండిటినీ కలిపి మంచి ఎక్స్‌ఫోలియేటర్‌లా పనిచేస్తుంది. చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తుంది. ముఖంపై ఉండే అదనపు నూనెను తొలగిస్తుంది. అంతేకాదు నల్ల మచ్చలను కూడా తగ్గిస్తుంది.
ట్యాన్ తొలగించే బీట్‌రూట్, బియ్యం పిండి మాస్క్ తయారీ విధానం.. ఒక బీట్‌రూట్ తీసుకోవాలి. దీనికి రెండు కప్పుల బియ్యం నీరు, రెండు టేబుల్ స్పూన్స్ మిల్క్ పొడి, రెండు టీస్పూన్ బియ్యం పిండి కూడా తీసుకోవాలి.
బీట్‌రూట్ కట్ చేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. బియ్యం నీరు వేస్తూ పేస్ట్ చేయాలి. దీన్ని వడకట్టుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పాలపొడి, బియ్యం పిండి కూడా వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.
ఈ పేస్ట్‌ను ముఖం, శరీరంపై అప్లై చేసుకోవాలి. ఇది ఓ అరగంట అలాగే ఉంచాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖం కడగాలి. ఇది వారానికి రెండుసార్లు చేస్తే మెరుగైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యం, మెడ, మీ చేతిపై కూడా అప్లై చేసుకోవచ్చు. ఎండ వల్ల ఏర్పడిన ట్యాన్ తొలగిస్తుంది.