Chiranjeevi - Keerthy Suresh: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృషి తన జనరేషన్ లో అగ్ర హీరోగా ఎదిగారు. చిరంజీవికి కీర్తి సురేష్ ఆ మధ్య ‘భోళా శంకర్’ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలో నటించారు. కానీ అంతకు కొన్ని దశాబ్దాల ముందే చిరు.. కీర్తి సురేష్ తల్లి సరసన నటించారు. ఆ సినిమా విషయానికొస్తే.,
Chiranjeevi - Keerthy Suresh:చిరంజీవి ఒకప్పుడు తెలుగు బాక్సాఫీస్ కు చిరునామా. అంతేకాదు మెగా ఫ్యామిలీగా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ మంది హీరోలను సినీ ఇండస్ట్రీకి ఇచ్చిన ఫ్యామిలీగా రికార్డు క్రియేట్ చేసారు. భారత్ లో కపూర్ ఫ్యామిలీ కంటే మెగా ఫ్యామిలీ నుంచే దాదాపు ఎక్కువ మంది హీరోలున్నారు.
అంతేకాదు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వెళ్లి.. ప్రజా రాజ్యం పార్టీ అధినేతగా..ఆపై ఎమ్మెల్యేగా.. రాజ్యసభ ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పనిచేసిన ట్రాక్ రికార్డు చిరంజీవి సొంతం.
అంతేకాదు.. మాములు కింది స్థాయి హీరో నుంచి పద్మవిభూషణ్ వరకు మెగాస్టార్ కెరీర్ లో ఎన్నో అవార్డులు.. రివార్డులు..ఇక చిరంజీవి తన కెరీర్ మొదట్లో కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు వేసారు.
అంతేకాదు ఇన్నేళ్ల సుధీర్ఘ కెరీర్ లో ఆనాటి హీరోయిన్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 100 మంది పైగా హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో కీర్తి సురేష్ తల్లి మేనక కూడా ఒకరు. ఈమె చిరంజీవి సరసన ఓ సినిమాలో నటించారు.
అదే పున్నమినాగు సినిమా ఒకటి. ఇందులో టైటిల్ రోల్లో చిరంజీవి నటించారు. అందులో విలన్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. చిరు నటించిన తొలి సోషియో ఫాంటసీ మూవీ అని చెప్పాలి. ఏవియం ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజశేఖర్ దర్శకుడు.
పున్నమినాగు సినిమాలో చిరంజీవి.. సరసన మేనక హీరోను ప్రేమించే అనే కథానాయికగా నటించింది. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ ను చంపే పాత్రలో నటించారు. ఈమె ఎవరో కాదు. మహానటి సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న కీర్తి సురేష్ తల్లి. ఇందులో మేనక కాకుండా.. రతి అగ్నిహోత్రి, జయమాలిని, మాధవి వంటి కథానాయికలుగా నటించారు.
ఆ తర్వాత చాలా యేళ్లకు మేనక కూతురు కీర్తి సురేష్ తో ‘భోళా శంకర్’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అందులో కీర్తి సురేష్ కు అన్నపాత్రలో చిరంజీవి నటించారు.
చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాది మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నిర్మాణంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. కీర్తి సురేష్ రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా.