UPI Transaction Limit Increased Upto Rs 5 Lakhs: ప్రపంచమంతా డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయి. ఈ పేమెంట్లు రోజురోజు సులభతరమవుతున్న సమయంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. యూపీఐ పేమెంట్ల లిమిట్ పెంచుతూ ప్రజలకు శుభవార్త వినిపించింది. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు కూడా లిమిట్ పెరిగిందా అనేవి తెలుసుకోండి.
UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్ల లిమిట్ రిజర్వ్ బ్యాంక్ పెంచింది. అయితే పెరిగిన లిమిట్ అన్ని పేమెంట్లకు కాదు. పెరిగిన లిమిట్ ఎంత, సాధారణ పేమెంట్లకు పెరిగిందా అనేవి తెలుసుకోండి.
UPI Payment Limit Increase: భారతీయ రిజర్వ్ బ్యాంక్ యూపీఐ పేమెంట్లపై శుభవార్త వినిపించింది.
UPI Payment Limit Increase: తాజాగా జరిగిన పరపతి విధాన సమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక ప్రకటన చేశారు.
UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్ల లావాదేవీ లిమిట్‌ను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
UPI Payment Limit Increase: అయితే పెంచిన లిమిట్ సాధారణ పేమెంట్లకు కాదు. కేవలం పన్ను చెల్లింపులకు మాత్రమే యూపీఐ లిమిట్‌ను పెంచినట్లు గవర్నర్ తెలిపారు. పన్ను చెల్లింపులు బకాయి పడకుండా వెంటనే చెల్లింపులు అయ్యేలా ఆర్బీఐ యూపీఐ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచింది.
UPI Payment Limit Increase: యూపీఐ పేమెంట్లు క్యాపిటల్ మార్కెట్లు, ఐపీఓ సబ్స్క్రిప్షన్స్, రుణ చెల్లింపులు, బీమా, వైద్య, విద్యాపరమైన సర్వీసులకు లిమిట్ అనేది ఒక్కో రీతిలో ఉంటుంది.
యూపీఐ పేమెంట్ల లిమిట్ ఇలా రూ.5 లక్షలు: పబ్లిక్ ఆఫర్, రిటైల్ డైరెక్ట్ స్కీమ్, పన్ను చెల్లింపులు రూ.2 లక్షలు: క్యాపిటల్ మార్కెట్లు, ఐపీఓ సబ్స్క్రిప్షన్స్, ఫారిన్ ఇన్వార్డ్ రెమిటెన్సెస్ తదితర సేవలు రూ.1 లక్ష: సాధారణ పేమెంట్ల లిమిట్. ఈ లిమిట్ పెంచే యోచనలో ఆర్బీఐ లేదు