Hanu Man: బిందువు, బిందవు కలిసి సింధువు అయినట్టు చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ పెద్ద హిట్గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా విడుదలకు ముందు నుంచి ఆ తర్వాత ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకుంది. దాదాపు 10కి పైగా రికార్డులు హనుమాన్ పేరిట ఉన్నాయి. అవేంట్ మీరు ఓ లుక్కేయండి.
హను మాన్ ఈ పేరు చాలు.. అన్ని రికార్డులు మటు మాయం కావడానికి. ఈ మూవీ విడుదలకు ముందే 1000కి పైగా ప్రీమియర్స్ షోలు పడ్డ ఏకైక తెలుగు సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.
ఒక రోజు ముందు ప్రీమియర్స్ ద్వారానే దాదాపు రూ.3 కోట్లకు పైగా షేర్.. రూ. 6 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా మీడియం రేంజ్ స్మాల్ బడ్జెట్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది హనుమాన్.
సంక్రాంతికి విడుదలై చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర $ 5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. అమెరికాలో ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాల్లో టాప్ 5లో నిలిచింది.
ఈ సినిమా దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి మీడియం రేంజ్ సంక్రాంతి సినిమాగా హనుమాన్ మరో రికార్డు.
హిందీలో 'హనుమాన్' రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు. ఈ సినిమా తెలంగాణ, రెస్ట్ ఆఫ్ భారత్, ఓవర్సీస్, హిందీలో రూ. 50 కోట్ల గ్రాస్ అందుకున్న తొలి సినిమాగా రికార్డు.
హనుమాన్ సినిమాను ఇప్పటి వరకు థియేటర్స్లో కోటి మందికి పైగా వీక్షించారు. అది కూడా ఓ రికార్డు.
92 యేళ్ల తెలుగు సినిమా చరిత్రలో రూ. 100 కోట్ల లాభాలను తీసుకొచ్చిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్ మూవీ. త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది.