Fennel Water: వేసవికాలం నడుస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. శరీరం డీహైడ్రేట్ అయిందంటే అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. అందుకే సాధ్యమైనంతవరకూ నీళ్లు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. ఈ క్రమంగా ఎండల్నించి రక్షించేందుకు సోంపు డ్రింక్ అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది.
సోంపు నీళ్లు తాగడం వల్ల రక్తం శుభ్రమౌతుంది. శరీరంలోని అన్ని సమస్యలు చిటికెలో పరిష్కారమౌతాయి. కడుపులోని కండరాలు రిలాక్స్ అవుతాయి.
శరీరంలోని ఏదైనా భాగంలో స్వెల్లింగ్ ఉంటే ముఖ్యంగా కాళ్లలో స్వెల్లింగ్ సమస్య కన్పిస్తే సోంపు నీళ్లు మంచి ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి. ఆకలిని కూడా నియంత్రిస్తుంది. దీనికోసం రోజుకో గ్లాసు సోంపు నీళ్లు తాగాలి.
సోంపులో ఉండే ఫాస్పరస్, సెలెనియం, జింక్, మాంగనీస్, కొలీన్, బీటా కెరోటిన్ వంటి పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతాయి. కిడ్నీ, లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
శరీరానికి చలవ కల్గించే పదార్ధాలు లేదా డ్రింక్స్ వేసవిలో ఎక్కువగా తీసుకోవాలి. సోంపు డ్రింక్ ఇందుకు మంచి ప్రత్యామ్నాయం. సోంపులోని పోషకాలు శరీరంలోని వ్యర్ధాలు, మలినాలను బయటకు తొలగిస్తాయి. శరీరాన్ని అద్భుతంగా డీటాక్సిఫికేషన్ చేస్తుంది.
ఎండాకాలంలో శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. దీనికోసం సోంపు డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ డైట్లో సోంపు డ్రింక్ చేరిస్తే నీటి కొరత ఉండనే ఉండదు.