Vishwak Sen Laila: హీరోయిన్లు ఈర్ష్య పడేలా విశ్వక్‌ సేన్‌ లేడీ గెటప్‌.. చూస్తే అబ్బాయిలకు నిద్రపట్టదు

Vishwak Sen Lady Getup So Hot In Laila Looks Goes Viral: ప్రయోగాత్మకంగా విశ్వక్‌ సేన్‌ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపించాడు. లైలా అనే పాత్రలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌ కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లేడీ గెటప్‌లో విశ్వక్‌ సేన్‌ను గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడు.

1 /7

సినీ పరిశ్రమలో కష్టపడి పైకొచ్చి తొలి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్న నటుడు మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌. ప్రస్తుతం భారీ హిట్‌ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాడు.

2 /7

విశ్వక్‌ సేన్‌ తాజాగా 'లైలా' అనే సినిమాతో ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రొటీన్‌ సినిమాలకు భిన్నంగా 'లైలా'తో కొత్త ప్రయత్నం చేశాడు.

3 /7

రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో సాహూ గారపాటి నిర్మాణంలో తెరకెక్కుతున్న 'లైలా' సినిమాలో విశ్వక్‌ సేన్‌ ఆడవేషంలో కనిపించాడు. తాజాగా విడుదలైన లుక్‌లో విశ్వక్‌ గెటప్‌ కనిపించింది.

4 /7

ఆ గెటప్‌లో ఆడవాళ్లు.. తోటి హీరోయిన్లు ఈర్ష్య పొందేలా విశ్వక్‌ సేన్‌ ఉన్నాడు. పూర్తిగా ఆడపాత్రలో ఒదిగిపోయిన లైలాను చూస్తే అబ్బాయిలు నిద్రపట్టలేని స్థితిలో ఉంటారు.

5 /7

తనకు సహజసిద్ధమైన సోను పాత్రలో విశ్వక్‌ మెరిశాడు. గతంలో విశ్వక్‌ చేసిన హిట్‌ ఫార్ములా కథగా ఇది ఉంది. కొద్దిగా బొద్దుగా కనిపించిన విశ్వక్‌ నటనలో మెరుగయ్యాడని కనిపిస్తోంది. హైదరాబాద్‌ పాతబస్తీ బ్యాక్‌గ్రౌండ్‌ నేపథ్యంలో ఈ కథ నడిచేటట్టు ఉంది. ఈ సినిమాతో విశ్వక్‌ తన కెరీర్‌లో భారీ హిట్‌ పొందనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

6 /7

నీలి రంగు చీరలో విశ్వక్‌ సేన్‌ కనిపించాడు. చీర కట్టులో హాట్‌ హాట్‌గా కనిపించి కుర్రాళ్లు గుర్తుపట్టలేకపోతున్నారు. ఈ లుక్‌లో విశ్వక్‌ హీరోయిన్‌లకు గట్టి పోటీనిచ్చేలా ఉన్నాడు. ఈ ఫొటోలు నెట్టింట్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

7 /7

ఈ సినిమా కోసం విశ్వక్‌ సేన్‌ తీవ్రంగా కష్టపడ్డాడని తెలుస్తోంది. కనుబొమ్మలు.. మీసాలు తొలగించడమే కాకుండా చేతికి ఉండే వెంట్రుకలు తీసేశాడు. అమ్మాయిలా కనిపించేందుకు విశ్వక్‌ పడిన కష్టం సినిమాపై అతడికి ఉన్న ఇష్టాన్ని చెబుతుందని చిత్రబృందం పేర్కొంది.