Indian Driving License: ఏదైనా ప్రాంతాన్ని చుట్టి రావాలన్నా..ఆ ప్రాంత అందాల్ని ఆస్వాదించాలన్నా రోడ్ ట్రిప్ ఒక్కటే సరైంది. అయితే వేర్వేరు దేశాల్లో రోడ్డు ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే ఆయా దేశాల డ్రైవింగ్ లైసెన్స్ అవసరమౌతుంది. కానీ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 6 దేశాల్లో ఎలాంటి అంతరాయం ఉండదని మీకు తెలుసా. అంటే ఈ 6 దేశాల్లో ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు నడపవచ్చు.
స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ అందాల్ని ఆస్వాదించాలంటే రోడ్ ట్రిప్ మంచి మార్గం. ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఒక ఏడాది వరకూ వాహనాలు డ్రైవ్ చేయవచ్చు.
స్వీడన్ స్వీడన్లో కూాడ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. అడవుల్లో, సుందరమైన ద్వీపాల్లో, దేశంలోని అందమైన ప్రాంతాల్లో ఆనందంగా తిరగవచ్చు. మీ లైసెన్స్ స్వీడిష్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మనీ, నార్వే భాషల్లో ఏదైనా ఒక భాషలో ప్రింట్ కావల్సి ఉంటుంది.
స్పెయిన్ స్పెయిన్‌లో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్‌తో వాహనాలు డ్రైవ్ చేయవచ్చు. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
సింగపూర్ సింగపూర్‌లో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేస్తుంది. సింగపూర్‌లో 18 ఏళ్లుంటే చాలు డ్రైవింగ్ లైసెన్స్‌కు అర్హత పొందుతారు.
మారిషస్ మారిషస్‌లో 4 వారాల వరకూ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే 4 వారాలు నిరభ్యంతరంగా తిరగవచ్చు.
అమెరికా అమెరికాలో కూడా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా కారు రెంట్ తీసుకుని తిరగవచ్చు. అయితే 1-94 ఫామ్ తోడు ఉంచుకోవాలి.