Health Benefits: మనలో చాలా మంది గంటల కొద్ది పనులు ఒక పోశ్చర్ లో కూర్చుని పనులు చేస్తుంటారు. దీంతో భరించలేని విధంగా నడుము నొప్పి వస్తుంది. కనీసం కదల్లేని పరిస్థితి ఏర్పడుతుంది.
కరోనా మహమ్మారి ప్రభావం స్టార్ట్ అయ్యాక చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు, హైబ్రీడ్ విధానంలో ఆఫీస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
కొందరు గంటల తరబడి కూర్చుని పనులు చేస్తుంటారు. ఇలా చేస్తే భరించలేని విధంగా నడుమునొప్పి వస్తుంది. మెయిన్ గా దీని వల్ల డిస్క్ పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాస్త బ్యాక్ పెయిన్ కు దారితీస్తుంది.
ఆఫీస్ వర్క్ లేదా మరే పనిచేస్తున్న కూడా ఒకేపొజిషన్ లో గంటల తరబడి కూర్చోవద్దు. గంటలకు పదినిముషాలైన లేచి అటు ఇటు నడవాలి. ఇలా నడవడం వల్ల నడుముపై ప్రభావం తగ్గుతుంది.
నడుము నొప్పి విపరీతంగా ఉంటే.. వేడి నీళ్లతో కాపడం పెట్టుకొవాలి. పచ్చి బట్టలు అస్సలు వేసుకొవద్దు. ముఖ్యంగా బరువులు ఎత్తేటప్పుడు, జర్నీలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
ప్రెగ్నెంట్ మహిళలకు బ్యాక్ పెయిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి క్రమంలో.. బరువులు ఎత్తకుండా చూసుకొవాలి. కూర్చునే చేయిర్ కూడా సరైనదిగా ఉండేలా చూసుకొవాలి.
ముఖ్యంగా ల్యాప్ టాప్ పెట్టుకునే ప్రదేశం, కూర్చునే చెయిర్ లు రెండు కూడా ఒకే పొజిషన్లలో ఉండేలా చూసుకొవాలి. ఇలా చేయకుంటే తరచుగా వెన్నునొప్పి సమస్య వస్తుంది. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)