Budhaditya Raja Yoga benefits: ఇవాళ వృషభరాశిలో బుధుడి రాక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు.
Budh Gochar in Taurus 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల రాకుమారుడిగా పిలువబడే బుధుడు ఇవాళ రాత్రి 7.40 గంటలకు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈరాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. ఇప్పటికే వృషభరాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తాజాగా మెర్క్యూరీ ప్రవేశంతో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. జూన్ 15 వరకు మాత్రమే ఈ యోగం ఉండనుంది. బుధాదిత్య యోగం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
ఇదే రాశిలోకి బుధుడు ప్రవేశిస్తూ.. సూర్యుడితో బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీంతో వృషభరాశి వారు కెరీర్ లో మంచి పురోగతి సాధించనున్నారు. ఆర్థికంగా బలపడతారు. ధనలాభం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి.
కన్యా రాశి వారికి బుధాదిత్య రాజయోగం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది.
బుధాదిత్య యోగంతో మకర రాశి వారు ఆర్థికంగా లాభపడతారు. మీకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఆర్థిక పరిస్థి మునుపటి కంటే బలపడుతుంది. పాత పెట్టుబడుల ద్వారా లాభం ఉంటుంది.
మీన రాశి వారికి బుధ సంచారం కలిసి రానుంది. మీరు కెరీర్ లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీరు వ్యాపారంలో భారీగా లాభాలను పొందుతారు.