Hyderabad Metro: హైదరాబాద్‌ ప్రజలకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. మేడ్చల్‌-శామీర్‌పేట్‌కు మెట్రో రైలు

Hyderabad Metro Rail Extend To Medchal And Shamirpet: హైదరాబాద్‌ ప్రజలకు కొత్త సంవత్సర కానుక ప్రభుత్వం నుంచి వచ్చేసింది. ట్రాఫిక్‌తో అల్లాడుతున్న శివారు ప్రాంత ప్రజలకు మెట్రో రైలు మరింత అందుబాటులోకి తీసుకురానున్నారు. మేడ్చల్‌, శామీర్‌పేట వరకు మెట్రో విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రజలకు కొన్ని ఏళ్ల తర్వాత ట్రాఫిక్‌ నుంచి విముక్తి లభించనుంది.

1 /9

హైదరాబాద్‌లో మెట్రో విస్తరణకు నాటి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోగా నేడు అవి కార్యరూపం దాల్చనున్నాయి.

2 /9

కొత్త సంవత్సరం వేళ మెట్రో రైలు విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

3 /9

నూతన సంవత్సర కానుకగా శామీర్‌పేట్, మేడ్చల్ వరకు మెట్రో రైలును విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

4 /9

జూబ్లీ బస్టాండ్‌ నుంచి శామీర్ పేట్ వరకు 22 కిలోమీటర్లు మేర మెట్రో విస్తరించనున్నారు. 

5 /9

ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల వరకు మెట్రో మార్గం నిర్మించనున్నారు.

6 /9

మెట్రో రైల్ ఫేజ్ -2 'బీ'లో భాగంగా ఈ మార్గాల్లో మెట్రో రైలు విస్తరణ కోసం డీపీఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.

7 /9

జేబీఎస్‌-శామీర్‌పేట మార్గంలో జేబీఎస్‌ మెట్రో స్టేషన్, శామీర్‌పేట్, విక్రమపురి, కార్ఖానా, త్రిముల్‌గేరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేటలో స్టేషన్లు వచ్చే అవకాశం ఉంది.

8 /9

ప్యారడైజ్ నుంచి మేడ్చల్ మార్గంలో ప్యారడైజ్ మెట్రో స్టేషన్, మేడ్చల్ మెట్రో, తాడ్ బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్ వద్ద స్టేషన్లు ఉండవచ్చు.

9 /9

ఈ రెండు మార్గాల్లో మెట్రో నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాల్సి ఉంది. కేంద్రం ఆమోదం తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. డీపీఆర్‌ తయారీ, కేంద్రం ఆమోదం తర్వాత ఈ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి దాదాపు పదేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.