Pm Kisan Yojana Eligibility Check: ఏవైనా ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించాలంటే తగిన ధృవపత్రాలను అందించాలి. లేకపోతే మీరు ఎలాంటి పథకాలకు అర్హత సాధించలేరు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడుత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఈ పథకానికి అర్హులు అవుతారా? ఇలా చెక్ చేసుకోండి.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PMKSY) 2019లో ప్రారంభించారు. దీని ద్వారా రైతులకు ప్రతి ఏడాది రూ.6000 మూడు విడుతల్లో మంజూరు చేస్తున్నారు.
ఇప్పటి వరకు 18వ విడుత నిధులు మంజూరు అయ్యాయి. 19వ విడుత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ నిధులు ఫిబ్రవరి 24వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ భాగల్పూర్ పర్యాటనలో విడుదల చేస్తారని చెప్పారు.
అయితే, వ్యవసాయశాఖ మంత్రి అయిన శివరాజ్ సింగ్ ఈ తేదీని ప్రకటించారు కానీ, దీనికి సంబంధించి అధికారిక వెబ్‌సైట్‌లో ఎలాంటి ప్రకటన చేయలేదు కేంద్ర ప్రభుత్వం. కేవలం 18వ విడుత నిధుల మంజూరు తేదీ మాత్రమే ఉంది ఈ నిధులు 2024 అక్టోబర్ 5వ తేదీ విడుదల చేశారు.
మీరు కూడా పీఎం కిసాన్ నిధులు పొందడానికి అర్హులు అవుతారా? తద్వారా ఈ పథకం నుంచి వచ్చే డబ్బులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా మీ ఖాతాలో జమా అవుతాయి.
19వ విడుత పీఎం కిసాన్ నిధులకు అర్హత సాధించాలంటే ముందుగానే ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. ల్యాండ్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ఇది కాకుండా మీ అకౌంట్‌కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి.