Year Ender 2024: పుష్ప సిరీస్ తో హిందీ చిత్రసీమలో బన్ని మరో రికార్డు.. పుష్ప 2 తో సంచలనాకు కేరాఫ్ అడ్రస్..

Pushpa 2 The Rule: గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో  టాలీవుడ్  సినిమాలదే హవా నడుస్తోంది. ఒక చిత్రం మొదటి భాగం    హిట్టైయితే.. రెండో భాగాన్ని కలెక్షన్స్ తో నెత్తిన పెట్టుకుంటున్నారు. అది బాహుబలి, కేజీఎఫ్ , పుష్ప సిరీస్ సినిమాలతో ప్రూవ్ అయింది. మొత్తంగా పుష్ప 1 సాధించిన విజయంతో పుష్ప 2 బాలీవుడ్ లో రికార్డులను తిరగరాస్తుంది.

1 /7

పుష్ప 2 ది రూల్ మూవీ.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 ఇప్పటి వరకు రూ. 665.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. తాజాగా ఈ రోజు వసూల్లతో రూ. 700 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

2 /7

6.2.O.. రజినీకాంత్, అక్షయ్ కుమార్ హీరోలుగా శంకర్ దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘2.O’. ఈ సినిమా హిందీ డబ్బింగ్ చిత్రాల్లో ఓవరాల్ గా రూ. 189 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 6లో నిలిచింది.  

3 /7

7. సలార్.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో  తెరకెక్కిన చిత్రం ‘సలార్ పార్ట్  -1 సీజ్ ఫైర్’. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ చిత్రాల్లో రూ.153.45 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 7లో ఉండటం విశేషం.

4 /7

8.సాహో.. ప్రభాస్ హీరోగా  సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఈ సినిమా సౌత్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో మన దేశంలో రూ.150.6 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన టాప్ 8లో ఉంది.

5 /7

ఆదిపురుష్.. ఓం రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ శ్రీరాముడిగా  తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రం బాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల్లో రూ.143.25 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 9 లో ఉంది.

6 /7

బాహుబలి పార్ట్ -1.. ప్రభాస్ హీరోగా  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘బాహబలి పార్ట్ -1 ది బిగినింగ్’. ఈ చిత్రం బాలీవుడ్ డబ్బింగ్ చిత్రాల్లో రూ. 115 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 10లో నిలిచింది.

7 /7

పుష్ప ది రైజ్ పార్ట్ -1.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన  చిత్రం ‘పుష్ప ది రైజ్  పార్ట్ -1’. ఈ సినిమా హిందీ డబ్బింగ్ సినిమాల్లో  రూ. 108.61 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 11లో నిలిచింది.