Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవికి తీవ్ర అస్వస్థత.. కంగారులో ఫాన్స్..!

Sai Pallavi Health: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం అక్కినేని నాగచైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది. ఫిబ్రవరి 7న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లలో.. ఆమె పాల్గొనలేదు. దీనిపై దర్శకుడు చందూ మొండేటి స్పందించారు. 

1 /5

డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి.. ప్రస్తుతం యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది. ఫిబ్రవరి 7న విడుదల కానున్న.. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ ప్రొమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అయితే, ఈ కార్యక్రమాల్లో సాయి పల్లవి.. పాల్గొనకపోవడం ఆమె అభిమానులను నిరాశకు గురిచేసింది.  

2 /5

తాజాగా దీనిపై తండేల్ చిత్ర దర్శకుడు చందూ మొండేటి స్పందించారు. సాయి పల్లవి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. “సాయి పల్లవి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతుండటంతో వైద్యులు పూర్తిగా.. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అందుకే ఆమె ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొనలేకపోయారు. కానీ, త్వరలో ఆమె తిరిగి ప్రమోషన్లలో పాల్గొంటారు,” అని తెలిపారు.  

3 /5

ఈ సినిమా శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామంలో జరిగిన నిజజీవిత సంఘటనల ఆధారంగా రూపొందింది. వేటకు వెళ్లిన కొంత మంది.. మత్స్యకారులు అనుకోకుండా పాకిస్థాన్ కోస్ట్ గార్డ్ చేతికి చిక్కి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన కథనంపై ఈ సినిమా రూపొందిందని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి ఒక కీలక సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు ఏకంగా 18 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది.  

4 /5

తండేల్ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 7న విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.   సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న 'రామాయణ' సినిమాలో సీత పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు.  

5 /5

ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతానికి ప్రమోషన్లకు దూరంగా ఉన్న సాయి పల్లవి, కోలుకున్న తర్వాత మళ్లీ తండేల్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.