These Things Never Burn In Bhogi Fire Dos And Donts: తెలుగు పండుగల్లో అతి పెద్దది సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే పండుగలో మొదటి రోజు భోగీ. చలికాలంలో వచ్చే భోగీ పండుగ తెల్లవారుజామున భోగి మంటలు వేసుకుంటాం. అయితే ఈ భోగి మంటల్లో ఏది పడితే ఆ వస్తువులు వేయరాదు. భోగి మంటల్లో వేయాల్సినవి.. వేయరాని వస్తువులు ఇవే!
భోగి 2025 పండుగ సోమవారం చేసుకుంటున్నాం. భోగి మంటల్లో పాత వస్తువులను కాలుస్తుంటారు. అయితే ఈ రోజు ఎలాంటి వస్తువులను కాల్చకూడదో తెలుసా?
భోగి పండుగలో ఫొటోలు కాల్చరాదు. కొందరు తమపై కోపం ఉన్న వారి ఫొటోలను భోగి మంటల్లో వేస్తుంటారు. ఎంత కోపం ఉన్నా కూడా అలా చేయరాదు.
మంటల్లో పాడుబడిన.. అవసరం లేదని దేవుడి ఫొటోలు, దేవుడికి సంబంధించిన పుస్తకాలు కాల్చరాదు. అలా చేస్తే అనర్థం చోటుచేసుకుంటుంది. ఇలా చేస్తే దురదృష్టం కూడా వెంటాడుతుందనే విశ్వాసం ఉంది.
ఆహారాన్ని నిప్పులో వేసి కాల్చవద్దు. భోగి మంటల్లోనే కాదు ఎప్పుడైనా కూడా ఆహారాన్ని కాల్చరాదు. కొన్ని శాస్త్రాల ప్రకారం ఇది మహా పాపం.
ఆరోగ్యాన్ని కలుషితం చేసే పదార్థాలను భోగి మంటల్లో వేయరాదు. రబ్బర్, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే వాసన రావడంతోపాటు భోగి మంటల విశిష్టతను దెబ్బతీస్తుంది.
మీరు ఎవరి నుంచి అయినా పొందిన బహుమతులు.. ఎవరితోనైనా మీ అనుబంధాన్ని చూపించే వస్తువులను భోగిమంటల్లో ఎప్పుడూ కాల్చకూడదు. అలా చేస్తే వారి మధ్య ఉన్న మీ అనుబంధాన్ని దూరం చేస్తుంది.
కొత్తగా కొనుగోలు చేసిన వస్తువులు లేదా ఉపయోగించిన వస్తువులను అగ్నిలో కాల్చవద్దు. భోగిమంటల్లో వీటిని కాల్చరాదు. భోగి మంటల్లో పిడకలు.. కలప.. గడ్డి వేసి సంప్రదాయంగా చేయాల్సి ఉంది. ఇష్టారీతిన భోగి మంటలు వేయడం సంప్రదాయం కాదు.