Tollywood: స్టార్ హీరోల అసలైన ఎత్తు.. అందరికన్నా పొట్టి ఎవరంటే...!

Heroes Heights: తాము చేయబోయే సినిమాలలో పాత్రలను బట్టి బరువు పెరుగుతూ తగ్గుతూ ఉండే.. మన హీరోలు.. అసలు ఎంత ఎత్తు ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది స్టార్ హీరోల ఎత్తు ఒకసారి తెలుసుకుందాం.

1 /6

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా పేరు తెచ్చుకున్న.. నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ 5'9" హైట్ ఉంటారు. మన జాబితా లో ఎత్తైన హీరో బన్నీనే అని చెప్పచ్చు. పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. 

2 /6

RRR తో గ్లోబల్ స్టార్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎత్తు 5'7". ఇక ఈ మధ్యనే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్ దేవర రెండవ భాగంతో కూడా మరొక హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు.

3 /6

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన ప్రాణ స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ లాగానే 5'7" ఎత్తు ఉంటారు. రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది.

4 /6

మన తెలుగు హీరోలతో పోలిస్తే తమిళ్ స్టార్ హీరో సూర్య ఎత్తు తక్కువ అని చెప్పాలి. సూర్య ఎత్తు కేవలం 5'5" మాత్రమే. సూర్య ఈ మధ్యనే హీరోగా నటించిన కంగువా సినిమా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. 

5 /6

మిగతా హీరోలతో పోలిస్తే..ఒక నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన విక్రమ్ నిజమైన ఎత్తు 5'6". విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ సినిమా ఈ మధ్యనే మంచి విజయాన్ని సాధించింది.  

6 /6

మన సౌత్లో మాత్రమే కాదు నార్త్ లో కూడా ఎత్తు తక్కువ ఉన్న హీరోలు ఉన్నారు. బాలీవుడ్ లోని ప్రముఖ ఖాన్ లలో ఒకరైన అమీర్ ఖాన్ కూడా సూర్య లాగానే 5'5" ఎత్తు ఉంటారు.