Star Hero Third Marriage: ప్రస్తుతం ప్రేమ, పెళ్లి, బ్రేకప్, విడాకులు అన్నీ సర్వ సాధారణంగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాలు కేవలం సామాన్యుల జీవితాల్లో మాత్రమే కాదు, సెలబ్రిటీల జీవితాల్లో కూడా జరుగుతున్నాయి. సెలబ్రిటీల పెళ్లి, విడాకులు, ప్రేమ వ్యవహారాలు.. తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి విషయమే ఒక స్టార్ హీరో జీవితంలో జరిగింది.
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. "మిస్టర్ ఫర్‌ఫెక్ట్"గా ప్రసిద్ధి పొందిన ఆమిర్ ఖాన్..తన వృత్తి జీవితంలో చాలా విజయాలను సాధించారు. వందలకొద్దీ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, సమాజానికి సంబంధించిన సమస్యలపై ఆలోచించే ప్రయత్నం కూడా చేసారు.
అమీర్ ఖాన్ 'సత్యమేవ జయతే' అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన కృషికి అనేక పురస్కారాలు లభించాయి, వాటిలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి అత్యున్నత పురస్కారాలు కూడా ఉన్నాయి. అయితే మరోపక్క..ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో కొన్ని.. వివాదాలకు గురయ్యారు. ఆయన మొదట రీనా దత్తాతో 1986లో పెళ్లి చేసుకున్నారు. ఆ జంటకు ఇద్దరు పిల్లలు జునైద్ ఖాన్, ఐరా ఖాన్ ఉన్నారు. అయితే 2002లో వారు విడాకులు తీసుకున్నారు. తరువాత, 2005లో కిరణ్ రావుతో పెళ్లి చేసుకున్న ఆమిర్, ఆ జంటకు ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడు ఉన్నారు. 2021లో ఈ పెళ్లి కూడా ముగిసింది.
ఇప్పుడిప్పుడే ఆమిర్ ఖాన్ తన మూడో పెళ్లికి సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన ఆయన పలు వివాదాల నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేక్‌తో సంబంధం ఉన్నారని ఇటీవల కొన్ని రూమర్స్ తెరపైకి వచ్చాయి.
కొంతకాలం ముందు వీరిద్దరి సన్నిహిత ఫొటోలు వైరల్ అయ్యాయి, దాంతో తమ సంబంధం గురించి గాసిప్‌లు పెరిగాయి. ఇక ఇప్పుడు ఈ అమ్మాయితోనే ఈ హీరో పెళ్ళికి సిద్ధమైనట్టు తెలుస్తోంది
ఈ క్రమంలో అమీర్ ఖాన్ తన పెళ్లి గురించి స్పందించారు. ఆయన తన మాజీ భార్యలతో ఇప్పటికీ మంచి సంబంధాలను కలిగి ఉన్నట్లు చెప్పారు. అలాగే, తాను త్వరలోనే మూడో పెళ్లి చేసుకుంటున్నాను అన్నట్లు కూడా ధృవీకరించారు. కానీ అతడు తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి గురించి మాత్రం చెప్పలేదు.