Sweat Rice Balls: అందమైన అమ్మాయిలను అక్కడ హోటల్స్ లలో జాబ్ లకు పెట్టుకుంటారు. వారి పనికేవలం అక్కడ ఎక్సర్ సైజులు చేయాలి. చెమటలు కక్కుతుండాలి. ఇలా చెమటలు కక్కిన తర్వాత అక్కడి డిష్ ను వారి చెంకలో పెట్టి మరీ అద్దుతారు. ఇలా చేసిన డిష్ కు అక్కడ ఫుల్ డిమాండ్ అని చెబుతుంటారు.
కొన్నిరోజులుగా భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఉష్ణోగ్రతలు పీక్స్ కు చేరుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలలో టెంపరేచర్ లు 47 డిగ్రీలను దాటేశాయి. అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లోద్దని నిపుణులు చెబుతున్నారు. బైటకు వెళ్లిన,ఇంట్లో ఉన్న చాలా మంది చెమటలు కక్కి సగం అవుతున్నారు. చెమటతో బెంబెలెత్తిపోతున్నారు.
సాధారణంగా కొందరిలో చెమట ఎక్కువగా వస్తుంది. దీంతో ఒళ్లంతా చెమటతో తడిసిపోతారు. మనకు కొద్దిగా చెమట వస్తేనే అస్సలు భరించలేము. చెమట వాసన నుంచి బైటపడాటానికి బాడీ స్ప్రెలు పలుమార్లు స్నానం చేస్తుంటాం. అయితే.. జపాన్ లో మాత్రం చెమట చేసిన డిష్ ను అక్కడ ఇష్టంతో తింటారు. అక్కడ దీనికి ఫుల్ డిమాండ్ కూడా ఉందని చెప్పుకుంటారు.
జపాన్ లోని ఒనిగిరి అనేది ఒక సంప్రదాయ వంటకం. ఒనిగిని అంటే అన్నం ముద్దలు. అయితే.. ఈ ఒనిగిరి ప్రిపరేషన్ స్టైల్ తెలిస్తే షాక్ అవుతారు. దీన్ని అందమైన అమ్మాయిల చంకనుంచి వచ్చే చెమటలో దీన్ని రుద్దుతారు. ఇలా రుద్దిన తర్వాత ఆ డిష్ ను అమ్మకానికి పెడుతారు. ఇక్కడ పనిచేసే అమ్మాయిలు ఎప్పుడు కూడా చెమటలు కారుస్తుంటారు.
వీరు కార్చిన చెమటలో అన్నంముద్దలను రుద్దుతారు. ఇలా రుద్దడం వల్ల ఆ చెమట నుంచి కొన్ని హర్మోన్ లు అన్నం ముద్దలలో వెళ్తాయంట. అవి తింటే లైంగిక సమస్యలు దూరమవుతాయంట. అంతే కాకుండా.. ఏజింగ్ సమస్యకూడా దరిచేరదంట. అందుకే జపాన్ లో చంకలోని చెమటతో తయారు చేసే డిష్ కు ఫుల్ డిమాండ్ అంట.
జపాన్ లో కొందరు చెమటల నుంచి ఫెరామోన్స్ అనే ప్రత్యేక హర్మోన్ లు రిలీజ్ అవుతాయని,దీన్నిఅన్నం ముద్దలకు రుద్దడం వల్ల, ఇవి తిన్నవారిలో లైంగిక పరమైన ప్రాబ్లమ్స్ ఉంటే మానిపోతాయంట. ముఖ్యంగా పెళ్లైన జంటలు ఈ చంకలోని చెమట ముద్దలను ఇష్టంగా తింటారంట. ప్రస్తుతం ఈ జపాన్ లోని డిష్ మాత్రం వైరల్ గా మారింది.
కొందరు నెటిజన్లు ఇదేం డిష్ రా నాయన అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి పాడుపనులు చేస్తుండవల్లనే లేని రోగాలు, మందులు కూడా లేని రోగాలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు. కొందరు ఈ ఘటన చూసి ఇదేం విడ్డూరం ఛీ .. ఛీ.. అంటూ కూడా స్పందిస్తున్నారు.