Cm Revanth Reddy: సీఎం రేవంత్ సర్కారు రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఈ క్రమంలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ మొదలైన సిబ్బంది అందరికి ఈ ఆదేశాలు వర్తిసాయని సర్కారు ఆదేశాలు సైతం జారీ చేసింది.
తెలంగాణ సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ముస్లిం సోదరులకు నెల రోజుల పాటు రంజాన్ నేపథ్యంలో కీలక మైన వెసులు బాటు ఇచ్చారు. ఇప్పటికే దేశ మంతట ఎక్కడ చూసిన రంజాన్ శోభ కన్పిస్తుంది. దుకాణాలన్ని కిటకిటలాడుతున్నాయి.
ముస్లిం సోదరులు రంజాన్ ను ఎంతో పవిత్రంగా చేసుకుంటారు. ఈ పండుగ నెల రోజులంతా కూడా ఎంతో కఠినంగా ఉపవాసలు చేస్తారు. కనీసం ఉమ్మిని సైతం మింగకుండా ఎంతో మంది ఉపవాసాలు చేస్తారు.
అదే విధంగా సూర్యోదయం కంటే మజ్జీత్ నుంచి సైరన్ మోగకన్న ముందే తినేస్తారు. ఆ తర్వాత మరల సాయంత్రం మజ్జీత్ నుంచి సైరన్ వచ్చాక మాత్రమే తింటారు. ఈ మధ్య కాలంలో అస్సలు ఏదీ తినరు.
ఆ అల్లా నామస్మరణ చేస్తునే ఎంతో కఠినంగా ఉపవాసం ఉంటారు. అదే విధంగా ఈ నెల రోజుల కాలంలో ముస్లింసోదరులు మజ్జీత్ కు వెళ్లి ఐదు సార్లు నమాజ్ చేస్తుంటారు. మజ్జీత్ కు నమాజ్ వెళ్లేందుకు కుదరని వాళ్లు, ఇంట్లో లేదా ఆఫీసులు ఎక్కడైన తమ నమాజ్ వేళల్లో తప్పనిసరిగా నమాజ్ చేస్తారు.
ఈక్రమంలో రేవంత్ సర్కారు ముఖ్యంగా ముస్లిం సోదరుల రంజాన్ ప్రార్థనల కోసం ప్రత్యేంగా నెల రోజుల పాటు వెసులుబాటు ఇస్తు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 2 నుంచి 31 వరకు కూడానెల రోజుల పాటు ప్రభుత్వ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ముస్లిమ్ ఉద్యోగులందరికి కూడా నెల రోజుల పాటు సాయత్రం గంట ముందే ఇంటికి వెళ్లిపోయే వెసులు బాటును ఇచ్చింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. ప్రభుత్వం కల్పిస్తోన్న ఈ తాజా వెసులుబాటు.. మార్చి 2 నుంచి మార్చి 31 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ వర్కర్లు సహా అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ముస్లిం సిబ్బందికి వర్తించనుందని ఆదేశాల్లో సర్కారు స్పష్టంగా పేర్కొంది. దీంతో ముస్లిం సంఘాలు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.