Toyota Urban Cruiser Taisor Price: కాంపాక్ట్ SUVలకు మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని మారుతీ, టాటా, టయోటా వంటి పెద్ద కార్ల తయారీ కంపెనీలు ఇలాంటి కార్లను ఎక్కువగా తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇదిలా ఉంటే టయోటా కంపెనీ కూడా మార్కెట్‌లోకి ఇటీవలే మరో కాంపాక్ట్ SUVని మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) అద్భుతమైన ఫీచర్స్‌తో కస్టమర్స్‌కి లభిస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన ఫీచర్స్, ధర పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) కారు కంపెనీ గతంలో లాంచ్ అయిన మారుతి ఫ్రాంక్స్ ఆధారంగా చేసుకుని తయారు చేసింది. అయితే దీనిని కంపెనీ ధర రూ.7.73 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ కారు 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఇందులోని బేస్ వేరియంట్ ధర రూ. 7.73 లక్షల లభిస్తోంది. ఇక హైఎండ్ వేరియంట్ వివరాల్లోకి వెళితే.. ఇది రూ. 13 లక్షలకు (ఎక్స్-షోరూమ్) ధరతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ కారు రెండు ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఇక ఈ toyota urban cruiser taisor కారుకు సంబంధించిన ఇంజన్ వేరియంట్ వివరాల్లోకి వెళితే.. ఇందులోని మొదటి వేరియంట్ పెట్రోల్ కాగా రెండవది CNG ఇంజన్ ఆప్షన్ లో లభిస్తోంది. అలాగే ఇందులోని బేస్ వేరియంట్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది.
ఈ టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Toyota Urban Cruiser Taisor) కారు సిక్స్ ఫీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో పాటు ఫైవ్ స్వీట్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో లభిస్తోంది. ఇక CNG వేరియంట్ ఇంజన్ 148 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది ఒక కేజీ సిఎన్జి కి దాదాపు 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తుంది.
ఇక ఈ Toyota Urban Cruiser Taisor కారుకు సంబంధించిన సేఫ్టీ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా 360 డిగ్రీ ప్రత్యేకమైన కెమెరా కూడా లభిస్తుంది. ఇక దీనికి తోడు ప్రత్యేకమైన హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి..