Tvs X Electric Scooter: అబ్బబ్బా Tvs X వేరే లెవల్‌.. అద్భుతమైన లుక్స్‌తో పిచ్చెక్కిస్తోంది.. మీరు కొనుగోలు చేస్తారా?


Tvs X Electric Scooter 2025: భారత మార్కెట్‌లోకి TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. అలాగే ప్రీమియం లుక్‌లో అందుబాటులో ఉంది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Tvs X Electric Scooter 2025: ప్రముఖ మోటర్‌సైకిల్ కంపెనీ TVS బైక్స్‌కి మార్కెట్‌లో అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ప్రీమియం ఫీచర్స్‌తోకి బైక్స్‌, స్కూటర్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. అలాగే మార్కెట్‌లో వస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌ దృష్టిలో పెట్టుకుని ఈ కంపెనీ కూడా త్వరలోను తమ కస్టమర్స్‌కి గుడ్‌న్యూస్‌ తెలిపింది. అతి తక్కువ ధరలోనే అద్భుతమైన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. 
 

1 /6

ఈ TVS మోటార్స్ విడుదల చేయబోయే స్కూటర్‌  X అనే సిరీస్‌లో విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో విడుదల కావడం టివిఎస్‌ కస్టమర్స్‌ పెద్ద గుడ్‌న్యూస్‌గా భావించవచ్చు. అయితే దీనికి సంబంధించిన విక్రయాలను కూడా కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. దీని డెలివరీని ఇప్పటికే ప్రారంభించింది.    

2 /6

ఇక ఈ TVS X ఎలక్ట్రిక్ స్కూటర్ వివరాల్లోకి వెళితే.. దీని ధర రూ. 2.50 లక్షల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌ ఇటీవలే మార్కెట్‌లోకి విడుదలైన అథర్ అపెక్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.   

3 /6

ఈ స్కూటర్‌ ఎంతో శక్తివంతమైన 4.44kWh శక్తివంతమైన బ్యాటరీతో లాంచ్‌ అయ్యింది. అయితే దీనిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 140 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. అలాగే ఈ స్కూటర్‌ ఇంజన్‌ 9.38bhp శక్తిని ఉత్పత్తి చేయడమే కాకుండా 40 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది.   

4 /6

TVS X e-స్కూటర్‌ మూడు అద్భుతమైన మోడ్‌లతో అందుబాటులోకి వచ్చింది. దీని గరిష్ట వేగం 105 kmph కంటే ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలిపింది. ఇది 3KW ఫిక్స్‌డ్ ఛార్జర్ సపోర్ట్‌తో విడుదలైంది. ఈ మోటర్‌సైకిల్ గంటలోనే 0 శాతం నుంచి 50 శాతం వరకు ఛార్జ్‌ అవుతుంది.  

5 /6

ఈ TVS X ఎలక్ట్రిక్ స్కూటర్‌  అద్భుతమైన 10.25-అంగుళాల TFT కన్సోల్ డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది స్పెషల్ NavPro నావిగేషన్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన అద్భుతమైన ఫీచర్స్‌తో లభిస్తోంది. దీని సీటు అన్నింటి కంటే ఎత్తులో 770 మిమీ ఉండబోతోంది.    

6 /6

కొత్త స్కూటర్‌ టెలిస్కోపిక్ ఫోర్కులను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకమైన సింగిల్-ఛానల్ ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్)ని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే భద్రత కోసం స్పెషల్‌ ఫీచర్స్‌ను అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ లభిస్తున్నాయి.