Pumpkin Seeds: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో మనిషి ఆరోగ్యానికి కావల్సిన ఎన్నో పోషకాలుంటాయి. ఏవి ఎందులో ఉంటాయో తెలుసుకోవడం చాలా అవసరం. వీటిలో అతి ముఖ్యమైనవి ఆనపకాయ విత్తనాలు. ఆయుర్వేదపరంగా వీటిని సూపర్ సీడ్స్ అంటారు.
Pumpkin Seeds: ఆనపకాయ విత్తనాలు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనం కలిగినవి. ఇందులో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి శరీరాన్ని వివిధ వ్యాధుల్నించి రక్షిస్తాయి. వీటి ప్రయోజనాలు పూర్తిగా తెలిస్తే ఇక ఆగరు..
ఆనపకాయ విత్తనాల లాభాలు ఆనపకాయ విత్తనాలను ఎనర్జీ పవర్ హౌస్ అంటారు. ఇవి వాల్‌నట్స్ రుచి కలిగి ఉంటాయి. ఈ విత్తనాలతో కలిగే పూర్తి ప్రయోజనాలు
గుండె ఆరోగ్యం ఆనపకాయ విత్తనాల్లో మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో దోహదం చేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది
ప్రోస్టేట్ ఆరోగ్యం ఆనపకాయ విత్తనాలు ప్రత్యేకించి పురుషులకు చాలా ప్రయోజనకరం. ఎందుకంటే ఇందులో జింక్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల మగవారిలో ప్రోస్టేట్ ఆరోగ్యంగా ఉంటుంది. ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు దూరమౌతాయి
జీర్ణక్రియ మెరుగుదల ఆనపకాయ విత్తనాల్లో ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది.
మెరుగైన నిద్ర, మానసిక ఆరోగ్యం ఆనపకాయ విత్తనాల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. నిద్ర బాగుండేలా చేస్తుంది. అలసట కూడా దూరమౌతుంది
ఇమ్యూనిటీ ఆనపకాయ విత్తనాల్లో జింక్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి. శరీరాన్ని వివిధ రకాల వ్యాధుల్నించి కాపాడుతాయి.
ఎలా తీసుకోవాలి ఆనపకాయ విత్తనాలను తినే విధానాలు చాలా ఉంటాయి. పచ్చివి తినవచ్చు. లేదా లైట్ ఫ్రై చేసి తినవచ్చు. మిరియాల పౌడర్ చల్లుకుని తినవచ్చు. సలాడ్‌లో కలుపుకుని తినవచ్చు