Viral Video: రెచ్చిపోయిన మందు బాబు.. ఏకంగా కరెంట్ వయర్ల మీద పడుకుని నానా హంగామా.. వీడియో వైరల్..

Drunken man video: మన్యం జిల్లాలో మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కరెంట్ వయర్ల మీద పడుకుని రచ్చ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Jan 1, 2025, 12:21 PM IST
  • కరెంట్ వయర్ ఎక్కిన మందుబాబు..
  • రోడ్డు మీద హల్ చల్..
Viral Video: రెచ్చిపోయిన మందు బాబు.. ఏకంగా కరెంట్ వయర్ల మీద పడుకుని నానా హంగామా.. వీడియో వైరల్..

Drunken man sleeping on electric wires in manyam video: ఎక్కడ చూసిన కూడా జనాలు న్యూ ఇయర్ వేడుకల్లో రచ్చ రచ్చ చేస్తున్నారు. కొంత మంది తమ ఫ్యామిలీస్ తో సెలబ్రేషన్స్ చేసుకుంటే.. మరికొందరు తమ ఫ్రెండ్స్ తో దావత్ లలో బిజీగా ఉంటున్నారు. అయితే.. న్యూ ఇయర్ అనగానే.. కొంత మంది ఫుల్ గా తాగి హల్ చల్ చేస్తుంటారు. మరికొందరు తమ ఫ్రెండ్స్ తో రూమ్ లలో మందు తాగి.. హ్యాంగోవర్ దిగక.. . తలలు పట్టుకుంటారు.

కానీ మరికొందరు తప్పతాగి రోడ్ల మీదకు వచ్చి నానా హంగామా చేస్తుంటారు. అంతే కాకుండా.. మద్యం మత్తులో వాళ్లు ఏంచేస్తున్నారో వారికే అర్థం కాదు.. కొంత మంది ఎదుటి వాళ్ల మీద రాళ్లను వేస్తుంటారు. మరికొందరు బట్టలు తీసేస్తు అశ్లీలంగా ప్రవర్తిస్తుంటారు.

 

ఈ క్రమంలో మందుబాబుల విన్యాసాలు మాత్రం చాలా  విచిత్రంగా ఉంటాయని చెప్పుకొవచ్చు. తాజాగా.. ఒక మందుబాబు చేసిన రచ్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.

పూర్తి వివరాలు..

ఆంధ్ర ప్రదేశ్ లోని మన్యం జిల్లాలోని పాలకొండలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఎం.సింగిపురంలో ఒక వ్యక్తి గ్రామస్థులకు చుక్కలు చూపించాడు. తప్పతాగి మద్యం మత్తులో విద్యుత్ స్తంభం ఎక్కి వయర్ల మీద పడుకున్నాడు. వెంటనే అక్కడున్న వారు గమనించి.. ట్రాన్స్ ఫార్మర్ కరెంట్ ఆఫ్ చేసేలా అధికారులకు సమాచారం ఇచ్చారు.

అతని లక్ బాగుందో ఏంటో కానీ.. అతను ఎక్కినప్పుడు పవర్ లేదు.. మరల విద్యుత్ అధికారులు స్పందించి.. కరెంట్ సరఫరా సైతం నిలిపివేశారు. ఈ క్రమంలో అతడ్ని బతిమాలగ కొంత సేపు అక్కడే విన్యాసాలు చేశాడు. చివరకు అక్కడున్న వారు బలవంతంగా కిందకు దించారు.

Read more: Viral Video: ఇదెక్కడి విడ్డూరం.. చపాతీలు చేస్తు, గిన్నెలు వాష్ చేస్తున్న వానరం.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే..

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గామారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారు. పొరపాటున కరెంట్ సరఫరా ఉంటే.. కొత్త ఏడాది చూసేవాడివి కాదని సెటైర్ లు వేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News