Stunning Incident: పెళ్లి జరిగే సమయానికి 'ఆపండి' అని అరుపు వినిపిచ్చినట్టే అన్నమయ్య జిల్లాలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు మండపం పైకి వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన ప్రియురాలు రచ్చరచ్చ చేశారు. యాసిడ్ పోసి.. కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఫలితంగా ఓ యువతితో జరగాల్సిన తన ప్రియుడు పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ సంఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. బాధితుడు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Third Wave Coffee: కాఫీషాప్ బాత్రూమ్‌లో కెమెరా.. మహిళల రహాస్య వీడియోలు చిత్రీకరణ
అన్నమయ్య జిల్లా నందలూరుకు చెందిన ఓ యువతికి రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో వివాహం నిశ్చయమైంది. వారిద్దరి పెళ్లి అరవపల్లి గ్రామంలో జరిపేందుకు భారీ ఏర్పాట్లు జరిగాయి. ముహూర్తం సమయం కావడంతో మండపానికి వరుడు సయ్యద్ భాష చేరుకున్నాడు. మండపంపైకి ఎక్కుతున్న సమయంలో తిరుపతికి చెందిన జయ రంగ ప్రవేశం చేసి యాసిడ్‌తో దాడికి పాల్పడిది. అనంతరం కత్తితో సయ్యద్ భాషాపై దాడికి దిగగా అతడు ప్రతిఘటించాడు. వెంటనే బంధుమిత్రులు కూడా అడ్డుకోవడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.
Also Read: Krishna Vamsi: థియేటర్‌లో యువత పెళ్లి.. ఛీ అలా చేయొద్దని 'మురారి' దర్శకుడు వార్నింగ్
అయితే ప్రతిఘటన సమయంలో ఓ మహిళతోపాటు దాడికి పాల్పడిన జయ కూడా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన ఓ మహిళతోపాటు జయను కూడా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆమె దాడికి పాల్పడడానికి గల కారణాలు తెలుసుకున్నారు. సయ్యద్ భాష తనను ప్రేమించి మోసం చేశాడని.. వేరే యువతితో పెళ్లికి సిద్ధమవడంతో అడ్డుకోవడానికి వచ్చినట్లు జయ వివరణ ఇచ్చారు.
సయ్యద్ భాషా, జయకు గతంలోనే పరిచయమైంది. వారిద్దరూ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. కరోనాకు ముందు వీళ్లిద్దరూ ప్రేమగా ఉండగా.. తర్వాత దూరమయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లు మళ్లీ కలిశారు. అయితే కొన్నాళ్లుగా ఆమెను సయ్యద్ భాషా దూరం పెడుతున్నాడు. తనను కాదని వేరొకరితో వివాహానికి సిద్ధమైన విషయం తెలుసుకున్న జయ తనకు న్యాయం చేయాలని పెళ్లి వద్దకు చేరుకుంది. ఈ ఉదంతంలో సయ్యద్ భాషా, ప్రియురాలు జయను నందలూరు పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి