Huge King Cobra In Kitchen: పాములంటే ఎవరికి భయం ఉండదు.. చిన్న నుంచి పెద్ద వారి దాకా అందరూ భయపడుతూనే ఉంటారు. మరి కొంతమంది అయితే పాములను చూసి ఆఫ్ కిలోమీటర్ వరకు భయపడుతూ పరుగులు పెడతారు. ఇటీవలే ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. కొందరు స్నేక్ క్యాచర్స్ పాములను రిస్క్ చేసి పట్టుకునే క్రమంలో వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇందులోని చాలావరకు వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇటీవలే ఓ స్నేక్ క్యాచర్ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతో కోపంగా ఉన్న కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
వీడియో వివరాల్లోకి వెళితే.. ఒడిస్సాలోని భద్రక్ అనే గ్రామంలో అడవి ప్రాంతం దగ్గరలో ఉన్న ఓ ఇంట్లోకి కింగ్ కోబ్రా సంచారం చేస్తుంది. అయితే దీనిని గమనించిన ఆ ఇంటి యజమాని, స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిస్తారు. వెంటనే ఆ స్నేక్ క్యాచర్ పాము సంచారం చేసిన ప్రదేశానికి చేరుకుని పామును వెతుకుతాడు. అయితే ఇదే క్రమంలో క్యాచర్‌కు పాము కిచెన్‌లోని కుక్కర్, ఇతర వంట సమాన్ల పక్కన ఉండడం కనిపిస్తుంది. దీనిని గమనించిన ఆయన ఎలాగైనా పాములు పట్టేందుకు ప్రయత్నిస్తాడు.
అయితే ఈ పాము అన్ని కింగ్ కోబ్రాల కంటే కొంత భిన్నంగా ఉంది. ఆ స్నేక్ క్యాచర్ ఈ పామును ఎన్ని సార్లు పట్టుకోవలని ప్రయత్నించిన ఏ మాత్రం చిక్కపోవడం మీరు గమనించవచ్చు. అయితే స్నేక్ క్యాచర్ దీనిని గమనించి మరోసారి పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో ఆ కింగ్ కోబ్రా ఆయన చేతిపై కాటేసేందుకు ప్రయత్నించింది. ఆ క్యాచర్ ఏ మాత్రం భయపడకుండా సులభంగా పట్టేశాడు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియోను @Mirzamdarif అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. అయితే దీనిని పోస్ట్ చేసి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికీ ఈ వీడియోను 3 కోట్ల మందికిపైగా వీక్షించారు. అంతేకాకుండా నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter