king Cobra: వామ్మో.. చెట్టు మీద 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మాత్రం హడలెత్తిపోతారు..

Karnataka news: భారీ కింగ్ కోబ్రా అడవి నుంచి బైటకు వచ్చింది. అది  రోడ్డుపక్కన ఉన్న ఒకచెట్టు మీద ఎక్కి కొమ్మల్నిచుట్టుకుని కూర్చుండిపోయింది. రోడ్డుమీద ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొందరు పామును గమనించారు. వెంటనే  ఇంటి ఓనర్ ను అలర్ట్ చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 21, 2024, 12:15 AM IST
  • కర్ణాటకలో షాకింగ్ ఘటన..
  • చెట్టు మీద మాటు వేసిన భారీ కింగ్ కోబ్రా..
king Cobra: వామ్మో.. చెట్టు మీద 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే మాత్రం హడలెత్తిపోతారు..

Karnataka agumba 12 foot King Cobra spotted in a tree rescue video goes viral: అడవులు, కొండ ప్రాంతాలకు దగ్గరగా ఉండే ప్రాంతాలలో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. ముఖ్యంగా పొలాలు, చెట్లు, పొదలు ఉన్న చోట పాములు ఉంటాయి. కొన్నిసార్లు ఇవి మన ఇళ్లలోనికి కూడా వచ్చేస్తుంటాయి. పాములు.. బూట్లలో, బైక్ ల డీక్కీల మీద, కార్లలో దూరిపోతుంటాయి. ఇంట్లో ఎలుకలు ఉంటే వాటి కోసం కూడావస్తుంటాయి. ఏ చిన్న కన్నం ఉన్న కూడా ఉంటే.. దానిలోపల నుంచి పాములు ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. కొన్నిసార్లు పాములు మనుషులను కాటేస్తుంటాయి.  అన్నిపాములు విషపూరితమైనవి కావు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE Kannada News (@zeekannadanews)

కేవలం కొన్ని పాములు మాత్రమే మనిషికి ఆపద కల్గిస్తుంటాయి. గిరీనాగు, కింగ్ కోబ్రా, బ్లాక్ మాంబా వంటి పాములు అత్యంత విషపూరీతంగా ఉంటాయి. చాలా మంది పాముల్ని చూడగానే భయంతో పారిపోతారు. కొందరైతే పాముల పేర్లు సైతం ఎత్తడానికి ఇష్టపడరు. కొందరు పాముల్ని చంపితే దోషం చుట్టుకుంటుందని నమ్ముతుంటారు. అందుకే పాములకు ఆపద తలపెట్టరు. పాములకు చెందిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్లు కూడా వీటినిచూడటానికి  ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక భారీ కింగ్ కోబ్రా వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

 పూర్తి వివరాలు..

కర్ణాటకలోని అగుంబే అడవికి దగ్గరలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక భారీ కింగ్ కోబ్రా పాము అడవినుంచి బైటకు వచ్చింది. అది రోడ్డుమీద నుంచి పక్కనే ఉన్న ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టుమీద ఎక్కి కూర్చుంది. అది దాదాపు.. 12 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడున్న పాదాచారులు కింగ్ కోబ్రాను గమనించారు. అది చెట్టు మీద ఎక్కి కూర్చుని, బుసలు కొడుతుంది. వెంటనే వారు ఇంటి ఓనర్స్ ను అలర్ట్ చేశారు. వారు వెంటనే పాముల్ని పట్టేవారిని పిలిపించారు.

గంటల తరబడి కష్టపడి కింగ్ కోబ్రాను చెట్టు మీద నుంచి కిందకు దించారు. మెల్లగా దాన్ని ఒక సంచీలోకి వెళ్లేలా చేశారు. అంతేకాకుండా.. దాన్ని బంధించారు. ఆ తర్వాత మెల్లగా అడవిప్రాంతానికి తీసుకెళ్లి మరల దాన్ని వదిలేశారు.ఈ ఘటన అంతటిని వీడియో తీశారు. స్నేక్ సొసైటీ వారు దారితప్పి ఇంట్లోకి వచ్చిన పాముల్ని పట్టి, మరల వాటిఆవాసాల్లో వదిలేస్తుంటారు.

Read more: Snake in shoe: వానాకాలంలో ఇలాంటి ప్రమాదాలతో జాగ్రత్త.. వైరల్ గా మారిన షాకింగ్ వీడియో..

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్ .. కింగ్ కోబ్రా ఎంత డెంజర్ గా ఉంది భయ్యా.. దాన్ని చూస్తేనే భయంగా ఉంది..అంటూ కామెంట్లు పెడుతున్నారు. వామ్మో.. పాము ఎంత పెద్దదిగా ఉంది భయ్యా..  అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

 

Trending News