King Cobra Drinks Water: ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన వీడియోల్లో చాలా వరకు జంతువులకు, పాములకు సంబంధించిన ఎక్కువగా ఉండడం విశేషం. అయితే ఇలాంటి వీడియోలనే ఎక్కువ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా పాముల వీడియోలు చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పాము పాలు తాగడం అదంరూ చూసి ఉంటారు. అయితే నీరు తాగడం మీరు ఎప్పుడైనా చూశారా? మీరు ఈ వీడియోను చూస్తే పాములు పాలు మాత్రమే కాదు నీరు కూడా తాగుతాయని రుజువతుంది. అయితే చాలా వరకు పాములు నీరు తాగడం వంటి సన్నివేశాలు తక్కువగా చూసి ఉంటారు. అయితే నిపుణులు చెబుతుందేమిటంటే.. చాలా వరకు పాములు ఎండాకాలంలో వాటి నివాస ప్రాంతాల నుంచి బయటకు వచ్చి దాహాన్ని తీర్చుకుంటాయని వారంటున్నారు.
వేసవి కాలంలో కింగ్ కోబ్రాలు వాటి బాడీ డిహైడ్రేషన్‌కు గురికాకుండా నీటిని ఎక్కువగా తాగుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని జాతులు పాములు గర్భందాల్చిన తర్వాత కూడా నీరు అతిగా తాగుతుంటాయని సమాచారం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను మీరు గమనిస్తే, ఓ పాము దాని పరిసర ప్రాంతాల నుంచి బయటికి వచ్చి అయితే వేసవి కాలం కావడంతో దాహంతో అల్లాడుతున్న పామును గమనించిన స్నేక్ క్యాచర్స్, దానిని పట్టుకునే క్రమంలో ఓ ప్లాస్టిక్ బాటిల్‌తో నీటిని తాగించారు. అయితే ఎంతో దాహంతో ఉన్న పాము గుటగుట నీటీని తాగింది. ఈ సన్నివేశాలను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
కొన్ని రకాల పాములు మాత్రమే అతిగా నీటిని తాగుతాయి. ముఖ్యంగా కింగ్ కోబ్రాల విషయానికొస్తే.. అవి కేవలం 3 నుంచి 4 రోజులకు ఒక సారి నీటిని తాగుతాయని సమాచారం. అయితే మరి కొన్ని పాములు మాత్రం నీటిని తాగకుండా 7 రోజులు ఉంటాయి. అయితే మీరు ఈ వీడియోలో పామును గమనిస్తే నిస్సయక స్థితిలో కదలలేని పరిస్థితుల్లో ఉంది. అందుకే పాము ఎనర్జీ కోసం ఆ నీటిని తాగిందని తెలుస్తోంది. ఏది ఎమైనప్పటికీ పామలు కూడా నీరు తాగుతాయని ఈ వీడియో ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా పాములు కేవలం కొన్ని పరిస్థితుల్లోనే నీటిని ఎక్కువగా తాగుతాయని తెలిసింది.
ఇలా కింగ్ కోబ్రా గటగట నీటిని తాగుతున్న వీడియోను Geethanjali - Travel Saga అనే యుట్యూబ్ ఛానెల్ నుంచి పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరతై ఈ పాము వీడియోను చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరికొందరూ సోషల్ మీడియా వినియోగదారులు పాలు ఇలా నీటిని తాగడం ఏంటి అని కామెట్లలో ప్రశ్న వర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరతై ఇలాంటి వీడియోలు చూడడం చాలా అరుదని వారి అభిప్రాయాలను చెబుతున్నారు. అయితే ఈ వీడియోను ఇప్పటివరుకు 7లక్షల మంది వీక్షించారు.
Also Read: iPhone 15 Price: ఐఫోన్ 15 ప్రో డీటెయిల్స్ లీక్.. మొదటిసారిగా సరికొత్త ఫీచర్! సూపర్ లుకింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి