Viral Video: మధ్యప్రదేశ్‌కు చెందిన ఆ వీడియో ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది. చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతున్నాయి. హృదయ విదారకమైన ఆ దృశ్యం కంటతడిపెట్టిస్తోంది. అసలేం జరిగింది..
మధ్యప్రదేశ్‌లోని ఈ అమానవీయ, హృదయ విదారకమైన ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికలన్నింటిలో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వసతుల దుస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. ఇదొక కుమారుని నిస్సహాయత, ప్రభుత్వ దుస్థితికి అద్దం పట్టే ఘటన.
ఇది జరిగింది మధ్యప్రదేశ్ శహ్‌డోల్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్భరమైన వసతుల కారణంగా వెలుగుచూసింది. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వాహన సౌకర్యమే లేదక్కడ. ఆ నిస్సహాయుడైన, నిరుపేద కుమారుడికి..తల్లి మృతదేహం సొంతూరికి తీసుకెళ్లేందుకు డబ్బుల్లేవు. ప్రభుత్వాసుపత్రిలో వ్యాన్ సౌకర్యం లేదు. జిల్లా ఆసుపత్రికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంత గ్రామానికి తల్లి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తరువాత ప్రభుత్వంపై..ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఏర్పాట్ల లేమిపై ప్రతి ఒక్కరూ విమర్శలు చేస్తున్నారు. మరణించిన ఆ మహిళ పేరు జయమంత్రి యాదవ్. మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అనూప్‌పూర్ జిల్లా నివాసి. కొన్ని రోజుల క్రితం ఛాతీలో తీవ్రమైన నొప్పితో ఆసుపత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను అనూప్‌పూర్ జిల్లా ఆసుపత్రి నుంచి శహ్‌డోల్ జిల్లా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పటల్‌కు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
తల్లి మరణంతో దహన సంస్కారాల కోసం మృతదేహాన్ని సొంతూరికి తీసుకెళ్లేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ లాభం లేకపోయింది. ఆ ఆసుపత్రిలో మృతదేహాలు తీసుకెళ్లేందుకు ఏ విధమైన ఏర్పాట్లు లేవు. ఓ ప్రైవేట్ ఆంబులెన్స్ కోసం ప్రయత్నిస్తే..5 వేల వరకూ ఖర్చవుతుందని తెలిసింది. అంత స్థోమత లేకపోవడంతో విధి లేక..తల్లి మృతదేహాన్ని బెడ్ షీట్‌లో చుట్టి..బైక్‌కు కట్టి..వెనుక కూర్చుని తీసుకెళ్లాడు. ఈ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. తల్లి మృతదేహాన్ని బైక్‌పై ఎలా తీసుకెళ్తున్నాడో స్పష్టంగా చూడవచ్చు.
In the Shahdol district in MP, a man was forced to tie his dead mother's body to a motorcycle and ride it back to his village 80 km away as the district hospital didn't provide a hearse van. The man couldn't afford private vehicles that asked for Rs 5,000 for the trip. pic.twitter.com/yXalDRP876
— Kanwal Chadha (@KanwalChadha) August 1, 2022
ఇదేమీ మధ్యప్రదేశ్‌లో తొలి ఘటన కానేకాదు. ఆంబులెన్స్ లేక మృతదేహాన్ని మోసుకెళ్లాల్సిన పరిస్థితితో గతంలో చాలా జరిగాయి. గునా జిల్లాలోని ఆసుపత్రి యాజమాన్యం వ్యాన్ సమకూర్చకపోవడంతో..జూలై 11వ తేదీన రెండేళ్ల తమ్ముడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు 8 ఏళ్ల చిన్నారి పడిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు.
Also read: Viral Video: చీకటి రోడ్డులో డ్రైవింగ్.. దెయ్యాన్ని చూసి సుస్సు పోసుకున్న యువకులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook