Snake found in shoes video goes viral: నార్మల్ గా పాములు ఎలుకలు ఎక్కడుంటే అక్కడికి వచ్చేస్తుంటాయి. క్రూర జంతువులు ఏవిధంగా అయితే.. తమ వేటకోసం అడవిలో ఒక ప్రదేశం నుంచి మరోక ప్రదేశానికి వెళ్తుంటాయో.. పాములు సైతం అలానే తమకు ఇష్టమైన వేట అయిన ఎలుకల కోసం ఒక చోట నుంచి మరోక చోటకు ప్రయాణిస్తాయి. పాములకు చెందిన వీడియోలు ఎందుకో మరీ సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తలలో ఉంటాయి.
You will find them at oddest possible places in https://t.co/2dzONDgCTj careful. Take help of trained personnel.
WA fwd. pic.twitter.com/AnV9tCZoKS— Susanta Nanda (@susantananda3) July 11, 2022
చాలా మంది పాముల వీడియోలు చూసేందుకు ఎగబడుతుంటారు. వీటిలో చాలా వరకు భయం కల్గించేవిగానే ఉంటాయి. చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మెయిన్ గా పాములు, షూస్ లలో, బట్టలలో, హెల్మెట్ లలో, స్కూటీ డిక్కీలలో నక్కి ఉంటాయి . ఈ క్రమంలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్ గా మారింది.
అయితే.. పండితులు మాత్రం తరచుగా పాముల్ని చంపకూడదని, పాముల్ని చంపితే.. జీవతంలో కష్టాలు వస్తుంటాయని చెబుతారు. ఉద్యోగంలో, పెళ్లి విషయంలో ఏదైన ఆటంకాలు వస్తే అది కాలసర్పదోషం వల్లనే అని పండితులు చెబుతుంటారు . అందుకు పాములను హనీ తలపెట్టొద్దని మాత్రం చెబుతుంటారు.
పూర్తి వివరాలు..
ఒకరి ఇంట్లో షూస్ లో నుంచి ఏదో వెరైటీగా హిస్ .. హిస్ అని శబ్దం వచ్చింది. దీంతో అతగాడు ఏంటబ్బా.. ఇది అని ఇంట్లో అంతా వెతికాడు. చివరకు బట్టలు, అల్మారా కూడా వెతికాడు. ఇక లాభంలేదని చెప్పుల స్టాండ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడ షూస్ నుంచి ఏదో సౌండ్ వస్తుంది. సమ్ థింగ్ ఫిషి.. అని డౌట్ పడ్డాడు. వెంటనే దగ్గరకు వెళ్లి చూడగా.. పాము తోక కన్పించింది. ఇంకా ఆలస్యం చేయకుండా.. పాములను పట్టే వాళ్లకు సమాచారం ఇచ్చారు.
Read more: Viral Video: ఛత్ పూజవేళ అద్భుతం... భక్తురాలి పక్కనుంచి వెళ్లిన భారీ సర్పం .. వీడియో వైరల్.
అంతే కాకుండా.. స్నేక్ మెన్ అక్కడికి చేరుకున్నాడు. పామును చాకచక్యంగా షూస్ నుంచి బైటకు తీశాడు. కానీ అది బుసలు కొడుతూ కాస్తంతా అక్కడున్న వాళ్లను టెన్షన్ కు గురిచేసిందని చెప్పుకొవచ్చు. అయిన కూడా అతను పామును పట్టుకుని అడవిలొ వదిలేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇది గతంలో జరిగినట్లు తెలుస్తొంది. కానీ మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.