Man Lying Under Railway Tracks Video: సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రస్తుతం యువత రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది తమ ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు పట్టాల కింద పడుకోగా.. రైలు అమాంతం పట్టాల మీద నుంచి వెళ్లిపోయింది. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ వీడియోను అభిషేక్ నరేడా అనే వినియోగదారు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేస్తే.. ప్రాణాలు కోల్పోవడం ఖాయమని అంటున్నారు.
వీడియోను షేర్ చేస్తూ.. అభిషేక్ నరేడా ఓ క్యాప్షన్ రాశాడు. ఈ వైరల్ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదన్నాడు. కానీ యువత ఇలాంటి వీడియోలు చేయడం పూర్తిగా తప్పు అని అన్నాడు. ఇలాంటి వారిపై రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. భవిష్యత్‌లో ఎవరూ ఇలా చేయవద్దని సూచించాడు. ఈ వీడియోను రైల్వే పోలీస్ ఫోర్స్, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వేలను కూడా ట్యాగ్ చేశాడు.
वायरल वीडियो कहां का है यह तो पता नहीं लेकिन लोग इस तरह वीडियो बना रहे हैं जो सरासर गलत है ऐसे लोगों के खिलाफ रेलवे पुलिस को कड़ी कार्रवाई करनी चाहिए ताकि भविष्य में ऐसा करने से पहले सौ बार सोचे @RPF_INDIA @AshwiniVaishnaw @RailMinIndia pic.twitter.com/VmqAvN3yYw
— ABHISHEK NAREDA (@NaredaAbhishek) July 1, 2023
వైరల్ అవుతున్న వీడియోలో నీలిరంగు చొక్కా ధరించిన యువకుడు ట్రాక్, గ్రౌండ్ మధ్య పడుకుని ఉన్నాడు. కొద్ది క్షణాల్లో ట్రాక్‌పై రైలు అదే దిశలో అధిక వేగంతో వెళ్లింది. రైలు అత్యంత వేగంతో అతని మీదుగా వెళ్లినప్పుడు ఏ మాత్రం భయపడకుండా ఆ యువకుడు హాయిగా పడుకుని ఉండడం విశేషం. ఇందుకు సంబంధిన వీడియోను ఆ యువకుడి స్నేహితులు వీడియో తీశారు. ఈ వీడియో కింద కామెంట్స్ బాక్స్ నెగిటివ్ పోస్టులతో విమర్శిస్తున్నారు. పోలీసులు ఇలా మరోసారి ఎవరూ చేయకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి వీడియోలు వైరల్‌గా మారడం ఆందోళన కలిగిస్తున్నాయని అంటున్నారు.
Also Read: TS Inter Supplementary Results: నేడే ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్.. ఇలా చెక్ చేసుకోండి
Also Read: Happy Birthday MS Dhoni: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లు వీళ్లే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook