Passengers Stone pelting and attacks on ac coach in bihar: కుంభమేళకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో రైళ్లు, బస్సులు, విమానాలు అన్ని ఫుల్గా ఉంటున్నాయి. కుంభమేళ పరసర ప్రాంతాలలో దాదాపు.. 300 కి. మీ. ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళకు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి ఇండియన్ రైల్వేస్ ప్రత్యేకంగా రైళ్లను నడిపిస్తుంది. అయిన కూడా భక్తులకు అవి ఏమాత్రం సరిపొవడంలేదని చెప్పుకొవచ్చు.
Development model of the Hindi speaking states, travelling to Kumbh Mela.
Imagine even if a single vandal were to be a Muslim pic.twitter.com/Rl486nxEnL— Lavanya Ballal Jain (@LavanyaBallal) February 11, 2025
కుంభమేళకు ఇప్పటి వరకు 43 కోట్ల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. మరో రెండు షాహీ స్నానాలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో కుంభమేళకు ఇంకా భక్తులు తండోపతండాలుగా వస్తునే ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలోని మధుబనీ రైల్వేస్టేషన్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌పై కొంత మంది రాళ్లు రాత్రిపూట రాళ్లు రువ్వారు.
ఏసీ గది అద్దాలను సైతం పగలకొట్టారు. ట్రైన్ లో అడుగు పెట్టేందుకు స్థలం లేదు. మరోవైపు ప్రయాణికులంతా ఏసీ కోచ్ లలోకి చొచ్చుకుని రావడంతో ఏసీ కోచ్ లో ఉన్న వారు డోర్ లను లాక్ చేసుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన అక్కడి ప్రయాణికులు.. ఏసీ కోచ్ అద్దాలపై రాళ్లతొ దాడులు చేసి పగలకొట్టారు. అంతేకాకుండా.. అక్కడ కూర్చున్నవారితో వాగ్వాదానికి దిగారు. ఈ పరిణామంలో ట్రైన్లో ఉన్నవారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Read more: Viral Video: తగ్గెదేలా.. కుంభమేళలో క్రికెట్ ఆడుతున్న నాగసాధులు.. వీడియో వైరల్..
ట్రైన్ ముజఫరాపూర్ కు వెళ్లే ముందు సమస్తిపూర్ లో ఆగినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుందని సమాచారం. రాత్రి 8.45 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. దీనిపై రైల్వే అధికారులు సీరియస్ అయ్యారు. ఆర్పీఎఫ్ పోలీసులు దాడికి పాల్పడిన వారికోసం గాలింపు చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter