Man Sleeping on Moving Car: ఈ సీన్ చూస్తే.. ఇదేందయ్యో ఇది.. నేనేక్కడా చూడలే అని అనుకుంటున్నారు కదా.. అవును.. చాలా మంది అభిప్రాయం ఇంచుమించు ఇలాంటిదే. ఎందుకంటే ఒక బిజీ స్ట్రీట్‌లో పార్క్ చేసి ఉన్న కారు ముందు విండ్ షీల్డ్‌పై ఒక వ్యక్తి నిద్రపోవడం ఏంటి... అతడిని పట్టించుకోకుండా ఆ కారుకు సంబంధించిన వ్యక్తి కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోవడం ఏంటి.. అంతా ఏదో సినిమాటిక్ సీన్లా ఉంది కదూ.. కానీ ఇది రియల్ సీనే. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కంటపడిన ఈ దృశ్యాన్ని పాల్ బ్లెయిర్ అనే ఒక ట్విటర్ యూజర్ తన సెల్ ఫోన్ కెమెరాలో బంధించి ట్విటర్లో పోస్ట్ చేశాడు.
ఈ వీడియోలో కనిపించిన దృశ్యాన్ని పరిశీలిస్తే.. కారు పార్కింగ్ లాట్ లోంచి మెయిన్ రోడ్డు ఎక్కి వెళ్లిపోయింది. అప్పటికీ సదరు వ్యక్తి విండ్ షీల్డుపై తల పెట్టి కారు బానెట్‌పైనే పడుకుని ఉన్నాడు. కారును మరీ వేగంగా పోనిస్తే అతడి పరిస్థితి ఏంటనే ఊహే నెటిజెన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కానీ అతడు మాత్రం ఎలాంటి కదలిక లేకుండా పడుకునే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Just another day of working from home in DC. Spotted in Navy Yard. @PoPville pic.twitter.com/14rZiQgO9Y
— Paul Blair (@gopaulblair) October 5, 2022
మరోవైపు కారు నడుపుతున్న వ్యక్తి కూడా తాను తల్చుకుంటే కారు బానెట్ పై పడుకున్న వ్యక్తిని తట్టి లేపొచ్చు లేదా హారన్ మోగించి అతడి నిద్ర డిస్టర్బ్ చేయొచ్చు. కానీ కారు డ్రైవింగ్ సీటులో కూర్చున్న వ్యక్తి మాత్రం అలాంటిదేమీ చేయకుండా, కొంత నెమ్మదిగానే కారును డ్రైవ్ చేస్తూ ముందుకు సాగిపోతున్నాడు. దాన్నిబట్టి చూస్తే.. కారును నడిపే వ్యక్తికి కూడా అతడిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదని అనిపిస్తోందంటున్నారు ఈ దృశ్యం చూసిన నెటిజెన్స్. ఇదిలావుంటే, ఇదే వీడియోపై మరో వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. ఎవరో వ్యక్తి బాగా మద్యం సేవించి మద్యం మత్తులో కారుపై పడుకుని నిద్రపోయినట్టున్నాడు. అందుకే కారు కదులుతున్నప్పటికీ అతడిలో చలనం లేదంటున్నారు ఇంకొంత మంది నెటిజెన్స్.
Also Read : New Car Accident: డ్రైవింగ్ సరిగ్గా రాకముందే కొత్త కారు కొన్నాడు.. తర్వాత ఏమైందో మీరే చూడండి
Also Read : Woman Dance Viral Video: డ్యాన్స్ చేస్తోన్న యువతి వెనకాలే వచ్చి ఎంత పని చేశాడు.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి