Bike accident: వాహనదారులు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని సార్లు పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల అలాంటి ప్రమాదమే ఒకటి చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్‌పై జరిగిన ఓ యాక్సిడెంట్లో బైకర్ తృటిలో తప్పుంచుకోగా.. బైక్ మాత్రం పూర్తిగా ధ్వంసమైంది.
ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే..
ఓ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ రోడ్డు క్రాస్ చేస్తుండా.. గేట్ వేశారు రైల్వే సిబ్బంది. చాలా మంది గేట్లకు రెండు వైపుల చాలా మంది నిల్చున్నారు. కానీ ఓ బైకర్ మాత్రం ట్రైన్ వచ్చేలోపు రోడ్డు దాటేద్దామని.. గేటు దాటుకుని స్పీడ్‌గా వచ్చాడు. అయితే ట్రైన్ వస్తుందని టెన్షనతోనే లేక.. బైక్ స్కిడ్ కావడంవలనో గానీ సరిగ్గా.. రైలు వస్తున్న ట్రాక్‌పై కింద పడ్డాడు.
కింద పడ్డప్పటి నుంచి ఆ బైకర్ అత్యంత చాకచక్యంగా స్పందించి.. బైక్‌ను అక్కడే వదిలేసి పక్కకు జంప్ చేశాడు. దీనితో చిన్న చిన్న గాయాలతో అతడు బయటపడ్డాడు. కానీ ట్రైన్ స్పీడ్ ధాటికి బైక్ మాత్రం ముక్కలు ముక్కలైంది. అయితే ఇదంతా కేవలం సెకన్ల వ్యవదిలోనే జరిగింది.
ఆ బైకర్ పక్కకు తప్పుకోవడం క్షణం లేటైనా.. బైక్‌తో పాటే బైకర్ కూడా ట్రైన్ కింద పడేవాడు.
Smithereens 2022... bike and train🙂🙂🙂 https://t.co/alAgCtMBz5 pic.twitter.com/jBwFDeGGYA
— Rajendra B. Aklekar (@rajtoday) February 14, 2022
ఎక్కడ జరిగింది ఈ ఘటన..
ఈ ఘటన ముంబయిలో జరిగింది. ఇక వీడియోలో కనిపించిన ట్రైన్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా తెలిసింది. ఈ నెల 12 (శనివారం) సాయంత్రం 6.18 ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఇలాంటి ఘటనే ఇంతకు ముందు కూడా..
సీసీ కెమెరాలో రికార్డయిన ఈ ప్రమదానికి సంబంధించిన ఓ వీడియోను జర్నలిస్ట్ రాజేంద్ర బి.అక్లేకర్ ట్విట్టర్లో షేర్ చేశారు. గత ఏడిది కూడా అదే ప్రాంతంలో జరిగిన ఇలాంటి యాక్సిడెంట్ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
రెండో వీడియోలో ఏముందంటే..
2021 జనవరి 24 (ఆదివారం) జరగిన ఈ ఘటనలోకూడా.. ట్రైన్ వస్తున్న నేపథ్యంలో గేట్ వేశారు రైల్వే సిబ్బంది. దీనితో రెండు వైపుల గేట్లకు వెలుపల చాలా మంది వాహనాదారులు నిల్చుని ఉన్నారు.
అయితే ఓ బైకర్ మాత్రం గేట్ దాటుకుని వచ్చి ట్రాక్ వరకు వచ్చాడు. ట్రైన్ స్పీడ్ చూసి.. అక్కడే ఆగిపోయాడు. అయితే అతడు ఆగి చోటే ఉన్నా ప్రమాదం జరిగేది కాదు. కానీ ఆ బైక్ ఒక్కసారిగా రెండు అడుగుల ముందుకు వెళ్లింది బైక్. దీనితో బైక్ అదుపు తప్పి కింద పడింది.
బైక్‌ని పైకి లేపి వెనక్కి లాగుదామనేలోపే ట్రైన్ వేగంగా వచ్చింది. రైలు స్పీడ్ ధాటికి ఆ బైక్ తుక్కు తుక్కైంది. ఈ ఘటనలతోను బైకర్‌కు చిన్న గాయం కూడా కాకపోవడం మంచి విషయం.
రెండు వీడియోల్లోనూ.. బైకర్లు గేట్ వేసినా.. అనవసరంగా రిస్క్ చేసి బైక్‌లు పోగొట్టుకున్నారు. ఇంకాస్త అయ్యుంటే ప్రాణాలు కూడా గాలిలో కలిసి పోయేవి.
Smithereens...bike and train!😊😊😊 pic.twitter.com/3IGwtGHDLI
— Rajendra B. Aklekar (@rajtoday) January 27, 2021
నెటిజన్ల ఫైర్..
ఈ వీడియోలు చూసిన నెటిజన్లు ఒక్క క్షణం ఆగి ఉంటే.. బైక్ కూడా దక్కేది. అనవసరంగా రిస్క్ చేయొద్దు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. బైక్ పెట్రోల్ ట్యాక్ ఎక్స్ప్లోడ్ అయ్యుంటే ఊహించని పెద్ద ప్రమాజం సంభవించేది అని అంటున్నారు.
కేవలం రెండు క్షణాలు కూడా వెయిట్ చేయాలేరా అంటూ కొంత మంది నెటిజన్లు ఆ బైకర్లపై ఫైర్ అవుతున్నారు.
Also read: Cobra Viral Video: బాత్ రూమ్ లో కింగ్ కోబ్రా.. సడెన్ గా చూసి షాకైన మహిళ!
Also read: Child Swallowed Battery: 5 సెం.మీ బ్యాటరీని మింగేసిన చిన్నారి.. 14 గంటలు కష్టపడ్డ డాక్టర్లు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook