Watch Now: 250 అంగుళాల పొడవాటి జుట్టు ఉన్న వ్యక్తులను ఎప్పుడైనా చూసారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..

Long Hair Man Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వృద్ధుడు తన పది అడుగుల జుట్టును అందరికీ చూపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నటిజన్లు ఆచార్యాన్ని గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 15, 2023, 08:12 PM IST
Watch Now: 250 అంగుళాల పొడవాటి జుట్టు ఉన్న వ్యక్తులను ఎప్పుడైనా చూసారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వైరల్ వీడియో..

 
Long Hair Man Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వీడియో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురి చేస్తే మరికొన్ని నెటిజన్లను భయపెడుతున్నాయి. నిత్యం వందల కొద్ది వైరల్ అయ్యే వీడియోలో ఎక్కువగా జంతువులు, వింత మనుషులకు సంబంధించిన వీడియోలే ఉండడం విశేషం. గత కొన్ని రోజులుగా మనుషులు చేస్తున్న వింత చేష్టలు, వింత మనుషులకు  సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈరోజు వైరల్ అవుతున్న వీడియో ఏంటో దానికి సంబంధించిన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిరోజు వైరల్ అయ్యే వీడియోలో భాగంగానే ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. అంతేకాదండోయ్ జుట్టు అంటే ఇతనిదేనని అందరికీ తెలిసేలా చేసింది ఈ వీడియో.. ముందుగా మీరు వీడియోని గమనిస్తే ఓ వ్యక్తి గోడ పై నిలుచుని మరి తన పొడవాటి కురులను అందరికీ చూపించడం మీరు చూడొచ్చు. అవును ఇది అక్షరాల నిజం పొడవాటి జుట్టు ఉన్న చాలామంది భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఉన్నారని ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by JAMAICA VIRAL!! (@jamaicaviralofficial)

ఈ వీడియోలో కనిపిస్తున్న వృద్ధుడు గత 40 ఏళ్ల సంవత్సరాల నుంచి తన జుట్టును కత్తిరించకుండా పెంచాడని గ్రామస్తులు చెబుతున్నారు. దాదాపు ఈ జుట్టు పది అడుగులకు పైగానే ఉంటుందని వారు అంటున్నారు. ఏది ఏమైనా నేటి జీవన శైలి కారణంగా చాలామందిలో బట్టతలలు వస్తున్నాయి. కానీ ఈ వృద్ధుడికి జుట్టు సమస్య లేకుండానే ఇంత పొడవుగా పెరగడాన్ని చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.  

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

ఈ వీడియోను సోషల్ మీడియా వినియోగదారుడు తన ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వీడియో చూసిన వారంతా ఇదేం జుట్టు రా బాబు అంటున్నారు. నెటిజన్లు ఈ వీడియో పై కామెంట్ల రూపంలో స్పందిస్తున్నారు. ఈ జుట్టును గిన్నిస్ ఆఫ్ ది బుక్ రికార్డు కి ఎక్కించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్ల రూపంలో కోరుతున్నారు. మరికొందరైతే నాకు 30 ఏళ్లు కాలేదు.. కానీ ఇప్పుడే బట్టతల వచ్చిందని ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు

Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News