Viral Video today: ఏ ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. ధనవంతుడు లైఫ్ ఒకలా ఉంటుంది, పేదవాడి జీవితం మరోలా ఉంటుంది. కోటీశ్వరుడైనా ఏదో ఒక సమయంలో కష్టాలు పడే ఉంటాడు. ప్రపంచంలో చాలా దేశాలు ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. అందులో మనదేశం కూడా ఒకటి. ఈ మాట ఎంతో కాలంగా వింటున్నాం. ఇండియా ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినప్పటికీ.. పేదరికం మాత్రం అలానే ఉంది. కోట్ల మంది తిండి దోరకని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. దేశంలో అన్నింటి కన్నా ఆకలి చావులే ఎక్కువగా ఉన్నాయి. పట్టెడన్నం దొరక్క పస్తులు ఉండేవారు ఎంతోమంది ఇప్పటికీ కనిపిస్తున్నారు.
మనలో చాలా మంది రోజూ ఎంతో కొంత పుడ్ వేస్ట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి పుడ్ దొరక్క ఎంతో మంది పస్తులతో ఉంటున్నారు. మన దేశంలో పేద, మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. వీరు ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. తాజాగా ఓ స్కూల్ పిల్లాడు కూర లేకపోవడం అన్నంలో నీళ్లు, ఉప్పు వేసుకుని కలిపి తింటున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.
వీడియో ఓపెన్ చేస్తే.. ఇందులో ఓ అబ్బాయికి స్కూల్ కి టైం అయిపోతుంది. అంతేకాకుండా అతడికి బాగా ఆకలేస్తోంది. వంటగదిలోకి వెళ్లి చూసి అన్నం తప్ప ఏమీ ఉండదు. దాంతో ఆ పిల్లవాడు ఒక ప్లేట్‌లో అన్నం వడ్డించుకుంటాడు. కూర లేకపోవడంతో మంచినీటినే కూరగా వేసుకుంటాడు. అందులో కాసింత ఉప్పు వేసుకుని అన్నాన్ని తింటాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా.. నెటిజన్లు కంట కన్నీరు పెట్టిస్తుంది. దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా వారు ఎదుర్కోన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.
Life is not same for everyone... Respect food pic.twitter.com/IOqcxbhbbt
— SOUVIK (@price_trader_) March 3, 2024
Also Read: Viral Video: ఏంటి భయ్యా ఇంత వైలెంట్ గా ఉన్నావ్.. పరోటాను ఈ రేంజ్ లో ఎవరైనా ఉతుకుతారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook