'గ్రూప్ వాయిస్' ఫీచర్ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్

Last Updated : Oct 25, 2017, 03:35 PM IST
'గ్రూప్ వాయిస్' ఫీచర్ను ప్రవేశపెట్టనున్న వాట్సాప్

ప్ర‌పంచ‌వ్యాప్తంగా వందకోట్ల యూజర్లను కలిగిఉన్న వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫీచర్లతో అప్‌డేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే త్వ‌ర‌లో గ్రూప్ వీడియో కాలింగ్‌, గ్రూప్ వాయిస్ కాలింగ్ స‌దుపాయాల‌ను కూడా వాట్సాప్ కల్పించ‌నున్న‌ట్లు సమాచారం. ఇటీవ‌ల ఐఫోన్ల‌లో ఉప‌యోగించే వాట్సాప్ అప్‌డేట్ కోడ్‌లో ఇందుకు సంబంధించిన సంకేతాలు గుర్తించినట్లు అంత‌ర్జాతీయ టెక్నిక‌ల్ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. గ్రూప్ వీడియో కాలింగ్ కు కాస్త టైం పట్టినా ..   గ్రూప్ వాయిస్ కాలింగ్ స‌దుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వ‌ర‌లో  కల్పిస్తున్నట్లు వివరించారు. అయితే ఈ ఫీచ‌ర్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.

గ్రూప్ అడ్మినిస్ట్రేట‌ర్ల‌కు స్పెషల్ రైట్స్ క‌ల్పిస్తూ ఇటీవ‌ల వాట్సాప్ అప్‌డేట్ అయ్యింది. అయితే ఈ అప్‌డేట్ ప్ర‌స్తుతం ఐఓఎస్ వారికి మాత్రమే అందుబాటులో ఉంది. వారం రోజుల్లోగా ఆండ్రాయిడ్ యూజ‌ర్ల‌కు ఈ అప్‌డేట్ రానుంది. దీనివ‌ల్ల గ్రూప్ స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌ను గ్రూప్ అడ్మిన్ నియంత్రించ‌డం, గ్రూప్ పేరు, స‌బ్జెక్టు మార్చే హ‌క్కు గ్రూప్ స‌భ్యుల‌కు లేక‌పోవ‌డం, గ్రూప్ క్రియేటర్ ను డిలీట్ డిలీట్ చేసే అవకాశం లేకపోవడం వంటి మార్పులు రానున్నాయి.

Trending News