Second Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంలో కనిపిస్తుందా?

Solar Eclipse 2023 October: ముఖ్యమైన ఖగోళ సంఘటనల్లో సూర్యగ్రహణం ఒకటి. ఈ సంవత్సరంలో రెండో సూర్యగ్రహణఁ అక్టోబరు 14న ఏర్పడబోతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 02:49 PM IST
Second Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఎప్పుడు? ఇది భారతదేశంలో కనిపిస్తుందా?

Second Surya Grahan 2023: హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది నాలుగు గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. ఇందులో 2 సూర్యగ్రహణాలు మరియు 2 చంద్రగ్రహణాలు. ఇందులో ఒక సూర్యగ్రహణం మరియు ఒక చంద్రగ్రహణం సంభవించాయి. ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా, సూతక్ కాలం చెల్లుతుందో లేదో తెలుసుకోండి.  

ఎప్పుడు ఏర్పడబోతుంది?
సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం గత నెల 20న ఏర్పడింది. ఈ ఏడాది రెండవ మరియు చివరి సూర్యగ్రహణం అక్టోబరు 14న సంభవించబోతుంది. ఈ సూర్యగ్రహణం అశ్విన్ మాసంలోని అమావాస్య రోజున ఏర్పడబోతుంది. ఇప్పుడు ఏర్పడబోయేది కంకణాకృత సూర్యగ్రహణం. ఈ గ్రహణం అక్టోబర్ 14, 2023న శనివారం రాత్రి 08:34కి ప్రారంభమై అర్ధరాత్రి 02:25 గంటలకు ముగుస్తుంది.

ఏయే దేశాల్లో కనిపించనుంది?
ఈ రెండో సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల దాని సూతక్ కాలం కూడా చెల్లదు. బ్రెజిల్, పరాగ్వే, జమైకా, హైతీ, అమెరికా, చిలీ, డొమినికా, బహామాస్, కెనడా, అర్జెంటీనా, కొలంబియా, మెక్సికో, క్యూబా, బార్బడోస్, ఆంటిగ్వా మొదలైన దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించనుంది.

Also Read: Surya Gochar 2023: సూర్య సంచారంతో నెల రోజులపాటు ఈ రాశులకు ఊహించని డబ్బు.. మీ రాశి ఉందా?

కన్యారాశిలో సూర్యగ్రహణం
సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం కన్యారాశి మరియు చిత్తా నక్షత్రాలలో ఏర్పడుతుంది. దీని శుభ లేదా అశుభ ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. అందుకే సూర్యగ్రహణం సమయంలో కొంత మంది అప్రమత్తంగా ఉండాలి. సూర్యగ్రహణం సమయంలో ఎవరూ బయటకు వెళ్లవద్దు మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు.

Also Read: Luck Zodiac Signs: పుట్టినప్పటి నుండి ఈ రాశులవారు ధనవంతులు.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News