First Amavasya 2024: కొత్త సంవత్సరం ప్రారంభమై ఈరోజుకి ఎనిమిది రోజులు కావొస్తుంది. ప్రతి సంవత్సరం లాగా ఈ 2024 సంవత్సరంలో కూడా పౌర్ణిమ అమావాస్యలు వచ్చాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండింటికి ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతినెల ఒక అమావాస్య ఒక పౌరుణిమ వస్తుంది. ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా అమావాస్య ముందుగా వస్తోంది. జనవరి 11వ తేదీన మొదటి అమావాస్య రాబోతోంది. ఈరోజు పితృతర్పణ చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ 2024 సంవత్సరంలో వస్తున్న మొదటి అమావాస్య ప్రాముఖ్యత ఏంటో? అమావాస్య తిథి నక్షత్రాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం పుష్య మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను పుష్య అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అమావాస్య రోజున సూర్యభగవానుడితోపాటు శ్రీమహావిష్ణువు, శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాకుండా ఈరోజు తులసి మాతకు కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించడం వల్ల జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. అంతేకాకుండా తులసిమాతను పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Also Read: Mars transit 2024: ఫిబ్రవరిలో కుజుడు రాశి మార్పు... ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..
కనుము వస్త్రాన్ని సమర్పించాలి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య రోజున తులసీమాతకి ఎరుపు రంగుతో కూడిన కనుము వస్త్రాన్ని సమర్పించి ఉదయాన్నే ప్రత్యేక పూజ చేయడం వల్ల సంపాదన రెట్టింపు అవుతుంది అంతేకాకుండా సకల శుభాలు కలుగుతాయి. ఆ తర్వాత సాయంత్రం పూట తులసి చెట్టు ముందు నెయ్యితో దీపం వెలిగించాలి.
ఎరుపు రంగు దారం:
మొదటి అమావాస్య రోజున తులసీమాతకు ఎరుపు రంగుతో తయారుచేసిన కంకణాన్ని కట్టడం వల్ల జీవితంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు జీవితంలో కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
Also Read: Shukra Gochar 2024: జనవరి 18న శుక్రుడి గోచారం.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ, జాబ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి