Lord Shiva: సోమవారం శివుడి పూజలో ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. వివరాలు మీకోసం..

Shiva puja:శంకరుడిని సోమవారం చాలా మంది భక్తితో పూజిస్తుంటారు. కానీ పూజలలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి.

Written by - Inamdar Paresh | Last Updated : Jan 28, 2024, 04:40 PM IST
  • శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరి నీళ్లను వాడుతుంటారు. కానీ కొబ్బరి కాయ అనేది లక్ష్మీదేవి స్వరూపం. లక్ష్మీదేవి విష్ణువు భార్య.. కనుక శివుని పూజలో కొబ్బరికాయను సమర్పించకూడదని చెబుతుంటారు.
Lord Shiva: సోమవారం శివుడి పూజలో ఈ తప్పులు అస్సలు  చేయోద్దు.. వివరాలు మీకోసం..

Mahadeva Abhishekam: శివుడిని భోళాశంకరుడు, భక్తవ శంకరుడు అని పిలుస్తుంటారు. భక్తితో శివుడిని స్మరించి, చెంబెడు నీళ్లు పోస్తే ఆయన ఆనంద పడిపోతారంట. బిల్వదళం కూడా శివుడికి అర్పిస్తే మనం కోరుకున్న కోరికలన్ని నెరవేరుతాయని చెబుతుంటారు. పరమేశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో అభిషేకం చేస్తుంటారు. అయితే.. శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలిని  పండితులు చెబుతుంటారు.

శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరి నీళ్లను వాడుతుంటారు. కానీ కొబ్బరి కాయ అనేది లక్ష్మీదేవి  స్వరూపం. లక్ష్మీదేవి విష్ణువు భార్య.. కనుక శివుని పూజలో కొబ్బరికాయను సమర్పించకూడదని చెబుతుంటారు. అదే విధంగా శివుడికి తెలుపు రంగుపూలు సమర్పించాలి. ఎరుపు రంగు పూలను అస్సలు పెట్టకూడదు.

Read Also: Spirutual: జీడిపప్పును ఈ దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే.. మీకోరికలు త్వరగా నెరవేరి దరిద్రం తొలగిపోతుందట..!

అదే విధంగా కొందరు శివుడికి తులసీ ఆకును సమర్పిస్తారు. కానీ ఇది కూడా సమర్పించకూడదు. ఎరుపు రంగు కుంకుమను కూడా పూజలో వినియోగించకూడదు. అభిషేకం చేసేటప్పుడు, రాగిపాత్రను కూడా ఉపయోగించకూడదని పండితులు చెబుతుంటారు.

శివుడి లింగానికి పసుపును పెట్టకూడదు. శివలింగం పెట్టడానికి స్టీల్ స్టాండ్ ను పెట్టకూడదు. శివలింగానికి జలధార ఉండేలా పానపట్టం ఉండేలా చూసుకొవాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Media ధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News