Wedding Dates in Maghamasam: కొన్నిరోజులుగా మంచి మూహుర్తాల కోసం శుభకార్యాలు చేసుకొవాలనుకునే వారు ఎంతో వేచిచూస్తున్నారు. ఈ క్రమంలో నేటితో (ఫిబ్రవరి 10) నుంచి మాఘమాసం ప్రారంభమైంది. శుభమూహుర్తాలు కూడా ఇవేనంటూ పండితులు పూర్తి వివరాలను వెల్లడించారు. మాఘమాసంలో అనేక విశిష్టతలు ఉన్నాయి. ఈ నెలలో సూర్యభగవాణుడిని కొలిస్తే మంచి జరుగుతుంది. అదే విధంగా మాఘమాసం రెండో రోజునుంచి శారద దేవీ గుప్త నవరాత్రులు ప్రారంభమౌతాయి. తొమ్మిదిరోజుల పాటు దేవీ నవరాత్రులను చాలా భక్తితో ఆచరిస్తారు. లలితా దేవీ అమ్మవారి అనుగ్రహం కోసం శారదా దేవీ నవరాత్రులను పాటిస్తారు.
వసంత పంచమి రోజు న విద్యాప్రదాయని సరస్వతి మాత పుట్టినరోజు. ఈరోజు చాలా మంది మన ఆదిలాబాద్ జిల్లాలో వెలసిన బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పొటెత్తుతుంటారు. ఈరోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఓంకారం కూడా రాయిస్తారు. ఈరోజున ఏపని ప్రారంభించిన కూడా అది నిర్వఘ్నంగా ముందుకు వెళ్తుందని పండితులు చెబుతుంటారు.
ఇక రథ సప్తమి రోజు సూర్యభగవాణుడ్ని పూజిస్తారు. శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యదేవుడిని భక్తితో పూజిస్తారు. ఆ రోజున సూర్యుడి కిరణాలు నేరుగా ప్రధాన ఆలయం విగ్రహం మీద పడతాయి. ఇక భీష్మాష్టమి. ఈ రోజున భీష్ముడు తన దేహత్యాగం చేశాడని చెబుతుంటారు. అందుకే ఈ మాసంకు గొప్ప విశేష ముందని పండితులు చెబుతుంటారు.
ఈ మాఘమాసంలో శుభమూహుర్తాలు ఇప్పుడు చూద్దాం..
ఫిబ్రవరిలో.. 11, 13, 14, 15, 18, 19, 21, 22, 24
మార్చిలో.. 1, 3, 7, 11, 13, 16, 17, 19, 20, 24, 25, 27, 28, 30
ఏప్రిల్‌లో.. 1, 3, 4, 5, 6, 9, 18, 19, 20, 21, 22, 24, 26
ఈ శుభమూహుర్తాలతో ఇటు పూజారులు, క్యాటరీంగ్, సన్నాయి. బ్యాండ్, ఫోటో గ్రాఫర్లు,డెకోరేషన్స్ , వెడ్డింగ్ ఈవెంట్ ఆర్గనైజర్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది.
Read More: Effects Of Mobile: మొబైల్ యూజ్ చేయడం వల్ల మతిమరుపు వ్యాధికి స్వాగతం పలికినట్లే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook