Astrology - Budha Guru Gochar: బుద్దికి, చదవుకు అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. హోలీకి ముందే బుధ గ్రహం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడి ఆగమనం తర్వాత మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించనున్నాడు.సుమారు 12 యేళ్ల తర్వాత మార్చి 26న మేషరాశిలో ఈ రెండు గ్రహల కలయిక వల్ల కొన్ని రాశుల అపూర్వ ప్రయోజననాలు కలుగనున్నాయి. ఇది ఏప్రిల్ 8 వరకు ఈ కలయిక ఉంటుంది. మేషరాశిలో బుధ, బృహస్పతిల కలయిక వల్ల ఏ రాశుల వారికీ అదృష్టం ప్రకాశించనుందో మీరు లుక్కేద్దాం..
కర్కాటక రాశి..
కర్కాటక రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మంచి ప్రయోజనాలు కలుగనున్నాయి. పనిచేసే ఆఫీసులో స్నేహితులు, పై అధికారుల నుంచి సహకారం లభిస్తాయి. అంతేకాదు గత కొంత కాలంగా వెంటాడుతున్న ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలకు ఛాన్సులున్నాయి.
సింహ రాశి..
సింహ రాశి వారికీ బృహస్పతి, బుధుల కలయిక వల్ల అద్భుత ప్రయోజనాలు కలుగనున్నాయి. ఉద్యోగులకు చేసే పనిస్థలంలో ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారులకు కొత్త ఆదాయ వనరులు సమకూరవచ్చు. చిన్న చిన్న సమస్యలు చిటికెలో పరిష్కరిస్తారు. భాగస్వామి నిర్ణయాన్ని గౌరవిస్తారు. మీరు ఎంతో ధైర్యంగా ఉంటారో.. అంతటి విజయం మీ పాదాల చెంత చేరుతుంది.
ధనుస్సు రాశి..
ఈ రాశి వారికీ బృహస్పతి, బుధ గ్రహాల కలయిక ఎంతో లాభం చేకూర్చనుంది. బుధ, గురు గ్రహాల కలయిక వల్ల గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ ప్రారంభమవుతాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానికి ఇంత కంటే అనువైన సమయం ఇదే. అంతేకాదు గత ఆనందం, సంపద యోక్క ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. మీరు ఆనందం మరియు సంపద యొక్క ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో, మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook