Astrology: సూర్య దేవుడు గ్రహాల రాజు. ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంఉంది. మే 13న సూర్య దేవుడు మేష రాశి నుంచి వృషభంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఆయా రాశుల వారికీ ఎలా ఉండబోతుందో జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మేష రాశి..
సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశించడం వల్ల మేష రాశి వారికీ ఆర్ధికంగా బలోపేతం అవుతారు. వ్యాపారంలో అనుకోని లాభాలు అందుకుంటారు. సహోదరులు సహాకారంతో రాణిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ఎక్కువ అవకాశం లభిస్తుంది. పనిలో విజయావకాశాలు మెండుగా ఉంటాయి. అదృష్టం బాగుంటుంది. ఉద్యోగం వ్యాపారం కోసం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి.
వృషభ రాశి..
ఉద్యోగ, వ్యాపారస్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. సంఘంలో గౌరవం పొందుతారు. మీ పనిలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శుభ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ప్రస్తుతం శుక్ర మూఢమి కారణంగా కొన్ని పనులను వాయిదా వేయక తప్పదు. విద్యారంగంలో ఉన్న వారికీ ఇది అత్యంత అనుకూలమైన సమయం.
మిథున రాశి..
ఈ కాలంలో కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. ఆత్మ విశ్వాసం పెరుగుతోంది. వైవాహిక జీవితం ఆనందమయంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో అనుకోని విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతోంది. పదవులు వరిస్తాయి. పెట్టుబడి మూలక ధనలాభం ఉంటుంది.
సింహ రాశి..
సింహా రాశి వారికి సూర్యుడు వృషభ రాశి ప్రవేశం వల్ల అనుకూలమైన ఫలితాలను అందుకుంటారు. లావాదేవీలకు ఇదే అత్యంత అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీ గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు రావచ్చు. ఈ సమయం ఈ రాశి వారికి వరం కంటే తక్కువ కాదు.
కన్య రాశి..
ఈ సమయంలో ఈ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్‌కు అవకాశం ఉంది. ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవాలి. ఫ్యామిలీలో ఎక్కువ సమయం గడుపుతారు. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కరామవుతాయి.
Disclaimer: ఈ జ్యోతిష్య కథనం.. ప్రజలు విశ్వాసాలు, నమ్మకాలతో ముడిపడి రాసినది. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. ఇది నిజమేనని చెప్పేందుకు కచ్చితమైన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter