Vasant Panchami 2023 Date: హిందూ గ్రంథాల ప్రకారం, మాఘ మాసం చాలా పవిత్రమైనది. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత పంచమి జరుపుకుంటారు. దీనికే శ్రీ పంచమి, మదన పంచమి, వసంతోత్సవం అని కూడా పేర్లు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈరోజున దేశవ్యాప్తంగా సరస్వతీదేవిని పూజిస్తారు. అంతేకాకుండా ఈరోజున రతీ మన్మథులను కూడా ఆరాధిస్తారు. మాఘ మాసం జనవరి 7 నుండి ప్రారంభం కానుంది. అయితే వసంత పంచమి జనవరి 26న వస్తుంది.
వసంత పంచమి 2023 ముహూర్తం
పంచాంగం ప్రకారం, వసంత పంచమి మాఘ మాసం శుక్ల పక్షం ఐదో రోజున జరుపుకుంటారు. మాఘ మాసం ఐదో తేదీ జనవరి 25, 2023న మధ్యాహ్నం 12.35 గంటలకు ప్రారంభమై.. జనవరి 26, 2023 ఉదయం 10.38 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, వసంత పంచమిని 26 జనవరి 2023న జరుపుకుంటారు.
వసంత పంచమి ప్రాముఖ్యత
ఈ వసంత పంచమి రోజున విద్యాదేవత అయిన సరస్వతీ దేవిని పసుపు బట్టలు ధరించి పూజించాలి. అంతేకాకుండా ఈరోజు వాగ్దేవి మాత వద్ద పుస్తకాలు, కలాలు పెట్టి జ్ఞాన ప్రాప్తి కోసం ఆరాధించండి. ఈ రోజున రతీ దేవి మరియు కామదేవిని పూజించడం ద్వారా వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
>> వసంత పంచమి రోజున సరస్వతీ మాతను షోడశోపచారాలతో పూజించండి.
>> ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం అని చెబుతారు.
>> ఈ రోజున పేద పిల్లలకు పుస్తకాలు మొదలైనవి దానం చేయండి.
>> వసంత పంచమి రోజున ఎవరితోనూ వాదించకూడదు.
>> ఇవాళ వాగ్దేవి మాతకు పసుపు తీపి అన్నం నైవేద్యంగా పెట్టండి.
Also Read: Malavya Rajyog: 2023లో 'మాలవ్య రాజయోగం'.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.