Budhaditya Raj Yog In Horoscope: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అంటారు. సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. సూర్యుడు రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. నిన్న అంటే సెప్టెంబరు 17న సూర్యుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఆ రాశిలో యువరాజు బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. దీంతో కన్యారాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వల్ల బుధాదిత్య యోగం (Budhaditya Raj Yog) ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశుల వారికి బుధాదిత్య యోగం శుభప్రదం
వృషభం (Taurus): వృషభరాశి వారికి బుధాదిత్య రాజయోగం చాలా శుభప్రదం. ఇది మీ జీవితంలో సుఖసంతోషాలను తెస్తుంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. చిక్కుకుపోయిన డబ్బు తిరిగి వస్తుంది. పిల్లలతో ఆనందాన్ని పొందుతారు. మెుత్తం మీద ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
సింహం (Leo): సింహ రాశికి సూర్యుడు అధిపతి మరియు సూర్యుడు కన్యారాశిలో సంచరించడం వల్ల ఏర్పడిన బుధాదిత్య రాజయోగం ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో పెద్ద డీల్ చేసుకునే అవకాశం ఉంది.
వృశ్చికరాశి (Scorpio): బుధాదిత్య రాజయోగం వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో పెద్ద లాభాలను ఇస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజెనెస్ విస్తరిస్తుంది. రాజకీయాల్లో చురుగ్గా ఉండే వ్యక్తులు ఏదైనా పదవిని పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మకరం (Capricorn): బుధాదిత్య రాజయోగం మకర రాశి వారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగం సాధించాలనే మీ కోరిక నెరవేరుతుంది.
Also Read: Grah Gochar in 2022: రాబోయే 4 నెలలు ఈ రాశులవారికి పండగే పండుగ...!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook