Chaitra Navratri 2023 Remedies: హిందూ ధర్మంలో దుర్గాదేవి నవరాత్రికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. నవరాత్రి రోజుల్లో దుర్గాదేవి ప్రసన్నత, కటాక్షం కోసం పూర్తి విధి విధానాలతో పూజలు చేయడం వల్ల దుర్గామాత ప్రసన్నతతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయంటారు. ఆ వివరాలు మీ కోసం..
నవరాత్రి రోజుల్లో దుర్గామాత ప్రసన్నత పొందేందుకు కొన్ని ఉపాయాలున్నాయి. ఇవి పాటిస్తే దుర్గాదేవి ప్రసన్నత లభిస్తుంది. మార్చ్ 29వ తేదీన నవరాత్రి అష్ఠమి తిధి సమాప్తమౌతుంది. మార్చ్ 30న శ్రీరామ నవమి ఉంది. నవరాత్రికి ఇంకా రెండ్రోజులు మిగిలుంది. ఈలోగా దేవి కటాక్ష పొందాలనుకుంటే..నవరాత్రి ముగియడానికి ముందే ఈ వస్తువుల్ని దానం చేయాలి. అప్పుడే మీ కష్టాలన్నీ దూరమౌతాయి. నవరాత్రిలో ఏ వస్తువుల్ని దానం చేస్తే లాభదాయకంగా ఉంటుందో తెలుసుకుందాం..
ఎర్రగాజులు
నవరాత్రి 9 రోజుల్లో దుర్గాదేవిని 9 వేర్వేరు రూపాల్లో పూజిస్తుంటారు. సౌభాగ్యపు సామగ్రి సమర్పిస్తుంటారు. దుర్గాదేవికి ఈ సామగ్రి సమర్పించడం వల్ల అఖండ సౌభాగ్య ఆశీర్వాదం లభిస్తుంది. అందుకే నవరాత్రి పర్వదినాల్లో ఎర్రరంగు గాజులు సమర్పించడం వల్ల దుర్గామాత ప్రసన్నత లభిస్తుంది.
అరటి
హిందూమత గ్రంధాల ప్రకారం నవరాత్రి రోజుల్లో దుర్గాదేవి కటాక్షం కోసం అరటి పండ్లు దానం చేయడం అవసరం. అరటి పండ్లు దానం చేయడం వల్ల వ్యక్తి ఇంట్లో డబ్బులు అదా అవుతాయి దుర్గాదేవి కటాక్షం కురుస్తుంది. ఈ నేపధ్యంలో ఆపన్నులకు దానమివ్వాల్సి ఉంటుంది.
బట్టలు
నవరాత్రి రోజుల్లో కన్యలకు బట్టలు దానమివ్వడం మంచి పరిణామం. వస్త్రదానం చేయడం వల్ల ఇంట్లో ఎదురయ్యే ఇబ్బందులు, నెగెటివిటీ, దుఖం, దరిద్రం అంతా నాశనమౌతుంది. అంతకాకుండా ఆ వ్యక్తి రోగుల్నించి విముక్తుడౌతాడు.
పుస్తకాలు
విజ్ఞాన భాండారాలైన పుస్తకాలు మనిషిని తీర్చిదిద్దుతాయి. నవరాత్రుల్లో పుస్తకాల దానం అత్యంత శుభసూచకం. దానం చేయడం వల్ల వ్యక్తి జీవితంలో ఎప్పుడూ కష్టాలు ఎదురుకావు. సరస్వతీ దేవి ఆశీర్వాదం తోడుగా ఉంటుంది.
ఇలాచీ
పూజాది కార్యక్రమాల్లో ఇలాచీ ఉపయోగం మహత్వపూర్వకంగా ఉంటుంది. నవరాత్రుల్లో ఇలాచీ దానం చేయడం చాలా చాలా మంచిది. ఇలాచీ దానం చేయడం వల్ల వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.
Also read: Mercury Combust 2023: బుధుడి అస్తమయం ప్రభావం, ఏప్రిల్ 23 నుంచి ఈ 4 రాశులకు పీడించనున్న కష్టాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook