Budh Vakri 2023: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ ఉంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని తెలివితేటలు, వ్యాపారానికి కారకంగా పరగణిస్తారు. అయితే ఈ బుధ గ్రహం ఆగస్టు 23వ తేదిన అర్థరాత్రి 01:28కి సింహరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. సెప్టెంబర్ 15 వరకు బుధ గ్రహం తిరోగమన స్థితిలోనే ఉంటాడు. అయితే ఈ తిరోగమన ప్రభావం కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాలపై పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో కొన్ని రాశులవారికి ఊహించని నష్టాలు కలుగుతాయట. అగస్టు 23 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఏయే రాశుల వారికి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారిపై బుధ గ్రహ తిరోగమన ప్రభావం:
మేషరాశి:
బుధుడి తిరోగమనం కారణంగా మేషరాశి వ్యక్తి గత జీవితంలో తీవ్ర మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరికి తీవ్ర దుష్ప్రభావాలు కలగడమే కాకుండా ఆర్థికంగా తీవ్ర నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ తిరోగమన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో పెట్టుబడులు పెట్టడం మానుకుంటే మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులు వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
వృషభ రాశి:
వృషభ రాశివారికి ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వారితో గొడవల కారణంగా సంబంధాలు తెగిపోతాయి. అంతేకాకుండా ఈ రాశివారు ఈ తిరోగమన సమయంలో కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే స్నేహితులతో కూడా గొడవపడే ఛాన్స్ కూడా ఉన్నాయి. విద్యార్థులు చదువులకు దూరమయ్యే అవకాశం ఉంది..కాబట్టి ఈ క్రమంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. అంతేకాకుండా వాహనాన్ని నడిపే క్రమంలో జాగ్రత్తగా ఉండండి.
సింహ రాశి:
బుధుడి తిరోగమనం సింహ రాశివారికి కూడా తీవ్ర సమస్యలు తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఊహించని ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా వీరు వెనబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా నష్టపోకుండా పొదుపు చేయడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మీ కుటుంబం లేదా స్నేహితులతో చర్చకు దూరంగా ఉండడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Loan Application For Defaulters: లోన్ ఎగ్గొట్టిన వాళ్లు మళ్లీ లోన్ కోసం అప్లై చేస్తే వస్తుందా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి