Fruits To Reduce Cholesterol: మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ పరిమాణాల కంటే ఎక్కువగా పేరుకుపోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ పరిమణాలను నియంత్రించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా జీవనశైలిలో మార్పులతో పాటు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల పండ్లను తినడం వల్ల కూడా సులభంగా చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే పండ్లు ఇవే:
యాపిల్:
కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించడానికి ఫైబర్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి యాపిల్ పండ్లలో ఈ ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
అరటిపండు:
అరటిపండు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పండులో కరిగే ఫైబర్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ను ప్రభావంతంగా నియంత్రిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
నారింజ:
శరీర బరువును, కొలెస్ట్రాల్‌ను నారింజ పండ్లు, రసం ప్రభావంతంగా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొలెస్ట్రాల్ నియంత్రించుకోవడానికి డైట్ పాటిస్తున్నవారు తప్పకుండా నారింజ పండ్లును తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ధమనుల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది.
పైనాపిల్:
పైనాపిల్ రసం అందరూ ఎంతో ఇష్టపడి తాగుతూ ఉంటారు. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పైనాపిల్‌లో ఉండే పోషకాలు తీవ్ర కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి