Jupiter Transit In Rohini Nakshatra 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహాన్ని ఎంతో ప్రత్యేక గ్రహంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై శుభ అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా బృహస్పతి గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉన్న వారికి సంచార సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే ఒక రాశి నుంచి మరో రాశికి ప్రవేశించినప్పుడు దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ బృహస్పతి గ్రహం ఈ రోజు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించింది. అయితే ఈ గ్రహం ఆగస్టు 20వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉంటుంది. దీంతో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలగడమే కాకుండా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అయితే రోహిణి నక్షత్రంలో ఈరోజు బృహస్పతి సంచారం చేయడం కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
మేషరాశి:
మేష రాశి వారికి ఈ రోజు నుంచి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరి సంపాదనలో మార్పులు వచ్చి, కొత్త ఆదాయ వనరులు పొందుతారు. అలాగే కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో కూడా విజయాలు సాధించే అవకాశాలున్నాయి. దీంతోపాటు వ్యాపారాలు చేసే వారికి కొత్త డీలింగ్స్ లభించి మెరుగుపడే ఛాన్స్ ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నా వారికి ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ పొందుతారు. అలాగే అనుకున్న పనులు కూడా సులభంగా జరుగుతాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారు ఈ సమయంలో విపరీతమైన లాభాలను పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి సంపాదనలో మార్పు వచ్చి అనుకున్న డబ్బును పొందుతారు. అలాగే బృహస్పతి అనుగ్రహం వల్ల వీరు అదృష్టవంతులవుతారు. దీంతో పాటు కుటుంబంలో శాంతి, సంతోషాలు రెట్టింపు అవుతాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన గొప్ప విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు వ్యాపారాధనలో వస్తున్న లాభాలు ఒక్కసారిగా పెరుగుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కన్యా రాశి:
బృహస్పతి అనుగ్రహం వల్ల కన్యా రాశి వారి వ్యక్తిగత జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. దీని కారణంగా వీరికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్స్ లభించడమే, కాకుండా కెరీర్‌కు సంబంధించిన విషయాల్లో గుడ్ న్యూస్ వింటారు. ఇక వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారమవుతాయి. దీంతోపాటు అద్భుతమైన ధన లాభాలను కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితం ఆనందంగా కొనసాగుతూ ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి