Chocolate Ganesha treat for 500 kids : వినాయక చవితి వచ్చిదంటే చాలు ప్రతి కాలనీలో గణేశుడి విగ్రహాలు (Ganesh idols) వెలుస్తాయి. అయితే పలు చోట్ల పర్యావరణ ప్రేమికులు రకరకాల కాలుష్యరహిత విగ్రహలను రూపొందించి ప్రకృతికి ఎంతో సహాయపడుతుంటారు. ఇదే తరహాలో పంజాబ్‌లోని లూథియానాకు (Ludhiana) చెందిన బేకరీ యజమాని హర్జిందర్ సింగ్ కుక్రెజా (Harjinder singh kukreja) విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని రూపొందింపజేశారు. ఈయన తయారు చేసిన గణేశుడి ప్రతిమకు చాలా ప్రాముఖ్యత ఏర్పడింది ఇప్పుడు.
అందరిలా కాకుండా ఈయన కాస్త వెరైటీగా ఆలోచించారు. చాక్లెట్ గణేశ్ విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే ఇలా చేయడం హర్జిందర్ సింగ్‌కు కొత్తేమీ కాదు. దాదాపు 6 ఏళ్లుగా ఈయన ప్రతి వినాయక చవితికి ఇలాగే చేస్తున్నారు. ఈ ఏడాది కూడా 2 వందల కిలోల బెల్జియం డార్క్ చాక్లెట్లతో (Dark chocolates) గణేశ్ విగ్రహాన్నితయారు చేశారు. ఒక ప్రొఫెషనల్ షెఫ్ టీమ్ పది రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేసింది. అయితే తయారు చేసే సమయంలో ఏ కొంచెం లోపం తలెత్తినా మళ్లీ మొదటి నుంచి ప్రారంభిస్తూ ఎంతో కష్టపడి ఈ చాక్లెట్ వినాయకుడిని తయారు చేశారు.
Also Read : Ganesh Chaturthi 2021: వినాయక చవితి ప్రాముఖ్యత, తిథి ముహూర్తం, ఇష్టమైన ప్రసాదం
500కు పైగా పిల్లలకు పంపిణీ
చాక్లెట్‌తో తయారు చేసిన ఈ గణేశ్ విగ్రహాన్ని మూడో రోజు 45 లీటర్ల పాలల్లో (Milk) నిమజ్జనం చేస్తారు. అనంతరం ఆ పాలనుపేద పిల్లలకు అందజేస్తారు. ఇలా ప్రతి గణేశ (Ganesha) ఉత్సవాల్లో భాగంగా ప్రతీ ఏట దాదాపుగా 500కు పైగా పిల్లలకు ఒక్కొక్కరికి గ్లాసెడు చాక్లెట్ మిల్క్ పంచుతున్నారు హర్జిందర్ సింగ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook