Lunar Eclipse 2023 October: ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం సంభవించిన తర్వాత ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ముందు ఏర్పడిన సూర్య గ్రహణ ప్రభావం భారతదేశంలో అంతగా పడలేకపోయినా ఈ చివరి చంద్రగ్రహణం ప్రభావం పడబోతోందని ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంభవించబోయే చంద్రగ్రహణం కారణంగా అన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చంద్రగ్రహానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన సూతక కాలం ఈరోజు సాయంత్రం 4:15 నిమిషాల నుంచి ప్రారంభం కాబోతుంది. పురాణాల ప్రకారం ఈ సమయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేయడం, ధ్యానం, తినడం, కొత్త పనులు ప్రారంభించడం నిషిద్ధం. ఈ సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న దేవాలయాలన్ని మూసివేస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పౌర్ణమికు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఈ సమయంలో చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
భారత్లో చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?
ఏర్పడబోయే చంద్రగ్రహణం పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం, ఆస్ట్రేలియా, ఆసియా, యూరప్, ఆఫ్రికా, తూర్పు దక్షిణ అమెరికా, ఈశాన్య ఉత్తర అమెరికాతో పాటు అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో గ్రహణం కనిపిస్తుంది.
ఇక భారత దేశంలో విషయానికి వస్తే..ఢిల్లీ, వారణాసి, ప్రయాగ్జ్, చెన్నై, హరిద్వార్, ద్వారక, మధుర, హిసార్, బరేలీ, కాన్పూర్, ఆగ్రా, రేవారీ, అజ్మీర్, అహ్మదాబాద్, అమృత్సర్, బెంగళూరు భోపాల్లలో చంద్రగ్రహణం కనిపిస్తుంది. వీటితోపాటు భువనేశ్వర్, చండీగఢ్, డెహ్రాడూన్, లూథియానా, జైపూర్, జమ్మూ, కొల్హాపూర్, కోల్కతా మరియు లక్నో, మధురై, ముంబై, నాగ్పూర్, పాట్నా, గౌహతి, డేపూర్, ఉజ్జయిని, బరోడా, రాయ్పూర్, రాజ్కోట్, రాంచీ, సిమ్లా, సిల్చార్తో సహా అనేక నగరాల్లో ఇది కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ఇక అర్ధరాత్రి సమయంలో పాక్షిక చంద్రగ్రహణం భారతదేశం అంతటా కనిపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.